Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుల్దీప్ భారత నెంబర్ వన్ ఆటగాడవుతాడు: హర్భజన్

Kuldeep will be Indias No.1 spinner going forward: Harbhajan Singh

న్యూ ఢిల్లీ: టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప‍్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా ఆశాకిరణం కుల్దీప్‌ అంటూ కొనియాడాడు. భవిష్యత్తులో అతను నంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా అవతరిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదని భజ్జీ ప్రశసించాడు. ఏడాదికాలంగా వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్.. 2019 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ అతను 10 వికెట్లతో సత్తాచాటాడు. ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలవనుండగా.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ గురించి హర్భజన్ సింగ్ మీడియాతో మాట్లాడాడు.

'భారత జట్టులో కుల్దీప్‌ యాదవ్‌ ఒక ప్రత్యేకమైన శైలితో దూసుకుపోతున్నాడు. టీమిండియాలో నంబర్‌ వన్‌ స్పిన్నర్‌గా అయ్యే సత్తా కుల్దీప్‌లో ఉంది. భవిష్యత్తులో భారత జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించడం ఖాయం. కుల్దీప్ యాదవ్ తన మణికట్టుతో బంతిని రెండు వైపులా తిప్పగలడు. అంతేకాకుండా.. బంతిని ఎక్కువ సేపు గాల్లో ఉంచి బ్యాట్స్‌మెన్‌‌ని తికమక పెట్టించి బోల్తా కొట్టించగలడు.

టీమిండియా జట్టులో నంబర్‌ వన్‌గా స్పిన్నర్‌గా కుల్దీప్‌ నిలవడానికి ఎంతో సమయం పట్టదు. సాధారణంగా మొదటిరోజు నుంచే బంతిని స్పిన్‌ చేయడం అంత సులభం కాదు. కుల్దీప్‌ మాత్రం మొదటి రోజు నుంచే వైవిధ్యమైన సంధిస్తూ ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో పడేస్తున్నాడు. రాబోవు సిరీస్‌ల్లో స్పిన్‌ విభాగంలో కుల్దీప్‌పైనే టీమిండియా ఆధారపడటాన్ని కూడా చూస్తాం. అతని జోరు ఇలానే కొనసాగితే మ్యాచ్‌ని శాసించే స్థితికి చేరుకుంటాడు. కచ్చితంగా భవిష్యత్‌లో అతను భారత్ నెం.1 స్పిన్నర్‌గా ఎదుగుతాడు'

కుల్దీప్ యాదవ్ నిలకడగా రాణించడంతో దాదాపు ఏడాదికిపైగా ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డే, టీ20లకి దూరంగా ఉండాల్సిన వచ్చిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, October 18, 2018, 18:47 [IST]
Other articles published on Oct 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+