ICC T20I Rankings: టీ20 కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌కి కుల్దీప్ యాదవ్

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై ఆఖరి మ్యాచ్‌లో ఓడిపోయిన మూడు టీ20ల సిరిస్‌ను చేజార్చుకున్న టీమిండియా... తాజాగా ఐసీసీ సోమవారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత జట్టులోని ఆటగాళ్లు తమ ర్యాంకులను మరింతగా మెరుగుపరచుకున్నారు. హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆదివారం ముగిసిన చివరి టీ20 మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడిన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు. మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది.

టీ20 కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌కి కుల్దీప్
చాహల్ స్థానంలో మూడో టీ20లో బరిలోకి దిగిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో టీ20 కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ని అందుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 793 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 728 పాయింట్లతో కుల్దీప్ యాదవ్ తాజాగా రెండో స్థానానికి ఎగబాకాడు.

609 పాయింట్లతో 17వ స్థానంలో చాహల్
భారత్ తరఫున టాప్-10లో కొనసాగుతున్న ఏకైక బౌలర్ కుల్దీప్ యాదవ్‌కాగా.. చాహల్ 609 పాయింట్లతో 17వ స్థానం, ఆ తర్వాత 608 పాయింట్లతో భువనేశ్వర్ కుమార్ 18వ స్థానంలో నిలిచారు. న్యూజిలాండ్ పర్యటనలో సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో టీ20 సిరీస్‌కి దూరమైన జస్ప్రీత్ బుమ్రా 26వ స్థానానికి పడిపోయాడు.

698 పాయింట్లతో ఏడో స్థానంలో రోహిత్ శర్మ
ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ 698 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్థాన్‌కి చెందిన బాబర్ అజామ్ 885 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విశ్రాంతి కారణంగా టీ20 సిరీస్‌కి దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ 599 పాయింట్లతో 19వ స్థానానికి పరిమితమయ్యాడు.

135 పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానంలో పాక్
జట్టు ర్యాంకింగ్స్‌లో 135 పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 124 పాయింట్లతో భారత్ రెండో స్థానానికే పరిమితమైంది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా (118), ఇంగ్లాండ్ (118), ఆస్ట్రేలియా (117), న్యూజిలాండ్ (116) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications