

హైదరాబాద్: ఇటీవలి కాలంలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ తమ బౌలింగ్‌తో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను కూడా ఇబ్బందిపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, అయితే చాహల్‌తో పోలిస్తే కుల్దీప్ ఎక్కువ ప్రమాదకరమని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు.
కుల్దీప్ యాదవ్‌కు మంచి భవిష్యత్తు ఉందన్న మాథ్యూ హేడెన్.... అతను షేన్ వార్న్ లాగా బంతిని గాల్లో బాగా తిప్పుతాడని చెప్పాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ "ఆఫ్ స్పిన్నర్లకన్నా లెగ్ స్పిన్నర్లు చాలా వైవిధ్యం చూపగలుగుతారు. కుల్దీప్ విషయానికి వస్తే.. షేన్ వార్న్ లాగా బంతిని గాల్లోనే తిప్పి బ్యాట్స్‌మెన్ ముందుకు పిచ్ చేసే విధానంలో అతడి బలం కనిపిస్తుంది. కాబట్టి అతడి బౌలింగ్ ఎదుర్కోవడం కష్టం" అని అన్నాడు.
ఇక, చాహల్ ఎక్కువగా స్టంప్ టు స్టంప్ బంతులు విసిరేందుకు ఇష్టపడతాడు. మరో భారత స్పిన్నర్ చాహల్ ఎక్కువగా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తాడని.. బంతిని గాల్లో పెద్దగా తిప్పడని, అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం అంత కష్టమేమీ కాదని హేడెన్ అభిప్రాయపడ్డాడు. అందుకే తానిప్పుడు ఆడి ఉంటే చాహల్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకే ఇష్టపడతానని అన్నాడు.