ఆ విషయం గురించి సౌరవ్ గంగూలీని, జయేషాను నిలదీయండి అన్న కేటీఆర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2022 టోర్నమెంట్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ రేసులో 7 జట్లు ఉన్నాయి. కేకేఆర్, సీఎస్కే, ముంబై దాదాపు ఫ్లేఆఫ్ రేసు నుంచి ఔట్ కాగా.. మిగిలిన నాలుగు స్థానాల కోసం 7 జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో లక్నో, గుజరాత్, రాజస్థాన్ దాదాపు ప్లేఆఫ్‌కు చేరుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. ఇక ఒక్క స్థానం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రేసులో ఉన్నాయి. అయితే ఐపీఎల్ ముగిసిన అనంతరం ఐపీఎల్లో ఆడుతున్న వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఎవరికి వారు తమ దేశం తరఫున లేదా కౌంటీల్లోనో ఆడటానికి వెళ్లిపోతారు. చాలా దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల షెడ్యూళ్లు పూర్తిచేశాయి. ఐపీఎల్ తర్వాత భారత జట్టు కూడా పలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. జూన్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఇక ఈ టీ20సిరీస్‌లో అయిదు మ్యాచ్‌లు జరగనున్నాయి.

షెడ్యూల్ ప్రకారం..
తొలి మ్యాచ్ జూన్ 9వ తేదీన చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ జూన్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నారు. మూడో టీ20 జూన్ 14న వైజాగ్ స్టేడియంలో ఉంటుంది. నాలుగో మ్యాచ్ జూన్ 17వ తేదీన గుజరాత్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇక చివరి మ్యాచ్ 19వ తేదీన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ పోస్ట్ చేసింది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించనున్నాడు.

హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఉండవా?
ఒకప్పుడు హైదరాబాద్.. క్రికెట్ మ్యాచ్‌లకు ప్రధాన అతిథ్యనగరంగా ఉండేది. రానురాను ప్రముఖ సిరీస్‌ల క్రికెట్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగడమే లేదు. గతంలో అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ప్లేయర్లు ఉన్న టైంలో ప్రతి సిరీస్‌లో హైదరాబాద్‌లో దాదాపు ఒక్క మ్యాచ్ అయినా జరిగేది. ఇటీవల ఐపీఎల్లో హైదరాబాద్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడం లేదన్న సంగతి తెలిసిందే. తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ జరుగుతుండగా ఒక్క మ్యాచ్ అయినా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుందేమో అని నగర, తెలంగాణ ప్రాంత క్రికెట్ అభిమానులు ఆశించారు. కానీ బీసీసీఐ షెడ్యూల్‌లో మాత్రం హైదరాబాద్ స్టేడియానికి మొండి చేయి చూపించింది. దీంతో ఇక్కడి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

బీసీసీఐ పెద్దలను అడగండి
ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌లో హైదరాబాద్‌లో మ్యాచ్ జరగకపోవడంపై ఓ అభిమాని స్పందిస్తూ.. కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. కేటీఆర్ సార్.. టీమిండియా మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పాన్సర్ చేయట్లేదు. క్రికెట్ అభిమానులుగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు చూడాలనుకుంటున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. దీనిపై కేటీఆర్ సైతం స్పందిస్తూ.. ఈ విషయాన్ని నన్ను కాదు అడగాల్సింది. బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జయేషాను, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని అడగండంటూ ఆ అభిమానికి రిప్లే ఇచ్చాడు. దీన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించడానికి సిద్ధంగా ఉందని కేటీఆర్ హింట్ ఇచ్చాడు. కానీ బీసీసీఐ పెద్దలే హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించడానికి షెడ్యూల్ వేయట్లేదు అని పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications