Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాండ్యా పెళ్లికి సచిన్ వచ్చాడోచ్..

Krunal Pandya ties the knot in Mumbai, Sachin Tendulkar attends the ceremony

హైదరాబాద్: 2017 ఏడాదిలో జరిగిన క్రీడాకారుల వరుస పెళ్లిళ్లకు కృనాల్ పాండ్య పెళ్లి ముగింపు పలికింది. పాండ్య జంట డిసెంబరు 26న ముంబైలో మెహందీ కార్యక్రమాన్ని ముగించుకుంది. ఘనంగా ఏర్పాటు చేసిన వేడుకలో తన ప్రేయసి ఫంకురి శర్మని పెళ్లాడి డిసెంబరు 27న ఒకింటి వాడయ్యాడు.

భారత యువ క్రికెటర్‌ కృనాల్‌ పాండ్య హార్దిక్‌ పాండ్యకి సోదరుడు. భారత్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్న కృనాల్ జట్టులో ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నాడు. ఏడాది క్రితమే తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన కృనాల్ అధికారికంగానూ తన ఫొటోలను ట్టిట్టర్ ఖాతాలో ఉంచాడు.

సచిన్ రాకతో వేడుక మురిసింది
కార్యక్రమానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ విచ్చేశాడు. ఆయన రాకతో అక్కడ ఉన్న వారందరికీ ప్రత్యేక ఆనందాన్ని కలుగజేసింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున పాండ్య సోదరులు ఆడటంతో మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో వీరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సచిన్‌ కృనాల్‌ పెళ్లికి హాజరై శుభాకాంక్షలు తెలిపాడు. ముంబై ఇండియన్స్ యజమాని ముఖేశ్ అంబానీ కుటుంబ సమేతంగా విచ్చేసి అభినందనలు అందజేశాడు. ప్రధాన ఆకర్షణగా అమితాబ్ బచ్చన్ నిలిచారు.

ఆహ్వానాన్ని అందుకుని విచ్చేసిన సచిన్‌ను హార్ధిక్ ఎదురెళ్లి హత్తుకున్నాడు. ప్రత్యేక వస్త్రాలంకరణతో నూతన వధూవరులు ఆకట్టుకున్నారు. అంతకముందు పెళ్లి మండపం వద్దకు వరుడు కృనాల్‌ బుల్లెట్‌పై ఊరేగింపుగా వచ్చాడు. ఆ వాహనానికి సారథి హార్థిక్ పాండ్యానే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 28, 2017, 13:40 [IST]
Other articles published on Dec 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+