ఐదు బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

సిడ్నీ: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఎట్టకేలకి తొలి వికెట్ పడగొట్టింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అరోన్ ఫించ్ (28), మరో ఓపెనర్ డీఆర్క్ షార్ట్ (33)తో కలిసి తొలి వికెట్‌కి అభేద్యంగా 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న ఆరోన్ ఫించ్‌ను ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన కృనాల్ పాండ్య వరుసగా 2 బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు.

ఐదు బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి
ఇన్నింగ్స్ 10వ ఓవర్ తొలి బంతిని ఎదుర్కొన్న డీఆర్క్ షార్ట్ వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోగా.. ఆ తర్వాత బంతికే బెన్ మెక్‌డెర్మాట్ కూడా అలానే ఔటయ్యాడు. దీంతో.. కేవలం ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లను చేజార్చుకున్న ఆస్ట్రేలియా 9.2 ఓవర్లు ముగిసే సమయానికి 73/3తో నిలిచింది.

టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలని కోహ్లి
భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అటు తాము కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలని అనుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఈ మ్యాచ్‌కు కూడా ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. సిడ్నీలో వర్షం కురిసే అవకాశం లేకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.

ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి
భారత్ వరుసగా మూడో టీ20లోనూ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతుండగా.. ఆస్ట్రేలియా మాత్రం ఒక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బెరెన్‌డార్ఫ్ స్థానంలో మిచెల్ స్కార్ట్‌ని తీసుకుంది. బ్రిస్బేన్‌లో గత బుధవారం రాత్రి ముగిసిన తొలి టీ20లో 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందగా.. వర్షం కారణంగా మెల్‌బోర్న్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే.

ఇరు జట్లు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), క్రిస్ లిన్,డీఆర్క్ షార్ట్, బెన్ మెక్‌డెర్మాట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, అలెక్స్ కేరీ, నాథన్ కౌల్టర్ నైల్ , ఆండ్రూ టై, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications