ఎన్నో ఏళ్లుగా మాతోనే.. ఆ రెండు మాకెంతో ఇష్టం: కృనాల్‌ పాండ్యా

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి ముంబైలో ఎక్కువగా ఉన్న కారణంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఇంట్లో తాను చేసే పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మరో పోస్ట్ చేశాడు. ఎన్నో ఏళ్లుగా తమ వద్ద ఉన్న కారు, బైక్‌ పోటోలను కృనాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.

అవి మాకెంతో ఇష్టం:

అవి మాకెంతో ఇష్టం:

ఇన్‌స్టాలో ఫొటో పంచుకున్న కృనాల్ పాండ్యా‌.. తన సోదరుడు హార్దిక్‌ పాండ్యా‌తో కలిసి కారు, బైక్‌పై కూర్చొని ఉన్నాడు. 'హార్దిక్‌, నేను ఈ కారు, బైక్‌లను చాలా సంవత్సరాలుగా కలిగి ఉన్నాం. ఆ రెండూ మాకెంతో ఇష్టం. వాటిపై బయటకు వెళ్లడం సరదాగా ఉంటుంది. పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకుతెచ్చాయి' అని కృనాల్ పాండ్యా‌ ఫొటోకు కాప్షన్ రాసుకొచ్చాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్యా‌.. ఇటీవలే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. తన ప్రేయసి నటాషా స్టాంకోవిచ్‌ గర్భవతిగా ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

త్వరలోనే ప్రాక్టీస్:

త్వరలోనే ప్రాక్టీస్:

ఇక ఈ ఏడాది ఐపీల్‌ 13వ సీజన్‌ సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్యలో యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ముంబై సోదరులు త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నాలుగు నెలలుగా ఇంటికి పరిమితమైన పాండ్యా‌ సోదరులు ఐపీఎల్‌లో ఆడాలంటే మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించాల్సిన అవసరం ఉంది. కాగా వీరిద్దరూ 2017, 2019 ముంబై ఇండియన్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 18 టీ20 మ్యాచ్‌ల్లో 121 పరుగులు:

18 టీ20 మ్యాచ్‌ల్లో 121 పరుగులు:

భారత క్రికెట్‌ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్‌‌గా హార్దిక్‌ పాండ్యా కొనసాగుతుండగా.. కృనాల్‌ పాండ్యా మాత్రం అడపాదడపా అవకాశాలకే పరిమితం అయ్యాడు. హార్దిక్‌ తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగితే.. కృనాల్‌ మాత్రం ఇంకా అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాడు. కృనాల్‌ ఒక పెద్ద సక్సెస్‌ కోసం పరితపిస్తూ టీ20లకే పరిమితమయ్యాడు. 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కృనాల్ 121 పరుగులు చేశాడు.

2016లో అరంగేట్రం:

2016లో అరంగేట్రం:

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 957, పొట్టి క్రికెట్‌లో 310 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీకి సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్‌ కారణంగా ఆ సిరీస్ రద్దు అయింది.

ఐఎంజీ రిలయన్స్‌తో శిఖర్‌ ధావన్‌ ఒప్పందం!!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 23, 2020, 13:02 [IST]
Other articles published on Jul 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X