Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ప్లేఆఫ్‌‌కు చేరుకుంటుందా?: కృనాల్ పాండ్యా ఇలా!

Krunal Pandya says Mumbai Indians not thinking about playoffs, focus is on winning next two matches

హైదరాబాద్: ప్లేఆఫ్స్‌ గురించి పెద్దగా ఆలోచించడంలేదని, ఈ సీజన్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లపైనే తమ దృష్టి ఉందని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్ జట్టు చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో తలపడనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్న ఢిల్లీ, చెన్నై

ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్న ఢిల్లీ, చెన్నై

ఈ సీజన్‌లో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్నాయి. మిగతా రెండు స్థానాల కోసం ముంబై, పంజాబ్, సన్‌రైజర్స్, కోల్‌కతా జట్లు బరిలో ఉన్నాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాలి.

14 పాయింట్లతో మూడో స్థానంలో

14 పాయింట్లతో మూడో స్థానంలో

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కృనాల్ పాండ్యా మాట్లాడుతూ "ఈ సీజన్‌ ఆరంభం నుంచి చక్కటి ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే ఆడిన 12మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో మెరుగైన స్థానంలో ఉన్నాం" అని అన్నాడు.

ప్లేఆఫ్స్‌ గురించి పెద్దగా ఆలోచించడం లేదు

ప్లేఆఫ్స్‌ గురించి పెద్దగా ఆలోచించడం లేదు

"ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లేఆఫ్స్‌ గురించి పెద్దగా ఆలోచించడంలేదు. ప్లేఆఫ్‌ బెర్తులను ఖాయం చేసుకోవడానికి చేతిలో మరో రెండు మ్యాచ్‌లున్నాయి. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని కృనాల్ పాండ్యా పేర్కొన్నాడు. పాయింట్ల పట్టికలో ముంబై మూడో స్థానంలో ఉండటంతో ప్లేఆఫ్‌ అవకాశాలు ఆ జట్టుకే ఎక్కువగా ఉన్నాయి.

గత మ్యాచ్‌ ఓడిన ముంబై ఇండియన్స్

గత మ్యాచ్‌ ఓడిన ముంబై ఇండియన్స్

ఈ సీజన్‌లో ముంబై తన చివరి రెండు లీగ్ మ్యాచ్‌లను హైదరాబాద్‌, కోల్‌కతాతో ఆడాల్సి ఉంది. మరోవైపు కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై తిరిగి పుంజుకుని ప్లేఆఫ్‌కు చేరుకుంటుందో లేక తడబడి ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంటుందో చూడాలి.

Story first published: Wednesday, May 1, 2019, 14:52 [IST]
Other articles published on May 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+