కృనాల్ పాండ్యాకు తగిలిన గాయం ఇదీ
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం రాత్రి రాయ్ పూర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మట్టికరిచింది. చివరి బంతి వరకు ఉత్కంఠతగా సాగిన ఈ పోరులో ముంబైని రెండు వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేలా చేసింది ఆర్సీబీ. బ్యాటర్లకు సవాలు విసిరిన పిచ్‌పై కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణించాడు. చివర్లో భువనేశ్వర్ కుమార్ మెరుపు బ్యాటింగ్ తో విజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు ఏదీ అచ్చి రాలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లు త్వరగా ఔటవడంతో పవర్ ప్లేలోనే తడబడింది. తిలక్ వర్మ (42 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57), నమన్ ధిర్ (32 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 47) సమయోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరి కీలక భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి కూడా ప్రారంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి. తొలి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ కూడా తక్కువ స్కోరుకే అవుటవ్వడంతో ఆర్సీబీ 24 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసే సమయానికి కెప్టెన్ రజత్ పాటిదార్‌ను సైతం కార్బిన్ బోష్ అవుట్ చేయడం ఆశలు అడుగంటాయి.
ఆ దశలో ముంబై ఇండియన్స్ పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. జస్ ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి పెంచగా, బోష్ అసాధారణ బౌన్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో పరుగులు తీయడం కష్టంగా మారింది. జాకబ్ బెథెల్ (27 బంతుల్లో రెండు ఫోర్లతో 27) కొంత వరకు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు.
అసలు టర్నింగ్ పాయింట్ కృనాల్ పాండ్యా రాకతోనే మొదలైంది. మొదట ఒత్తిడిని తట్టుకుని నెమ్మదిగా ఎదురుదాడికి దిగాడీ ఆల్ రౌండర్. విల్ జాక్స్, ఘజాన్‌ఫర్ బౌలింగ్ లో దూకుడుగా స్వీప్ షాట్లు ఆడాడు. స్ట్రెయిట్ బౌండరీలు బాదాడు. ఘజాన్‌ఫర్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా అతను కొట్టిన భారీ సిక్స్ మ్యాచ్ కే హైలైట్. బెథెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆర్సీబీకి ఊపు వచ్చింది. వికెట్లు పడుతున్నా కృనాల్ పోరాటం ఆపలేదు.
ఈ క్రమంలో అతను గాయపడ్డాడు కూడా. కడుపుపై పెద్ద దెబ్బే తగిలింది. చర్మం మొత్తం ఊడొచ్చింది. కడుపునకు ఎడమ వైపు భాగం అంతా ఎర్రగా కమిలిపోయింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కృనాల్ పాండ్యా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఓ హార్ట్ ఫెల్ట్ మెసేజీని దానికి యాడ్ చేశాడు. విలువైన పోరాటానికి గుర్తుగా కొన్ని గాయపు మచ్చలు మిగిలిపోతాయి, రుజువు చేస్తాయి. అనేది దాని సారాంశం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications