ట్విట్టర్‌లో నెటిజన్ల ఛలోక్తులు: ముష్ఫికర్ క్యాచ్‌ను పట్టిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా!

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమికి కారణం కృనాల్ పాండ్యా, ఖలీల్ అహ్మద్ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్పికర్ రహీమ్ క్యాచ్‌ను కృనాల్ పాండ్యా వదిలేయగా, చివర్లో ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి వల్లే టీమిండియా ఓడిపోయిందని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. "అసలు కృనాల్ పాండ్యాను భారత జట్టులో ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఏ ఉపాధి పథకం కింద ఖలీల్‌కు చోటు
మరొక నెటిజన్ అయితే "ఏ ఉపాధి పథకం కింద ఖలీల్‌కు చోటు కల్పించారు"అని ఎద్దేవా చేశాడు. "శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, నవదీప్ శైనీని పక్కనపెట్టి జట్టులో చోటు కల్పించడానికి ఖలీల్ అహ్మద్ ఏం అద్భుతాలు చేశాడు. తను చేసిందల్లా ధారాళంగా పరుగులివ్వడమే" అని మరొక అభిమాని కామెంట్ పెట్టాడు.
కృనాల్ నువ్వు అక్కడే ఉండు.. మేము వస్తున్నాం
"కృనాల్ నువ్వు అక్కడే ఉండు.. మేము వస్తున్నాం" అని మరొక అభిమాని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై దాడి చేయడానికి వెళుతున్న ఫొటో తెగ ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు టీమిండియాకు మంచి అవకాశాలే లభించాయి. కానీ, వాటిని సద్వినియోగం చేసుకోలేదు.
ఎల్బీ కోసం అప్పీల్ చేసినా స్పందించని అంపైర్
చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ వేసిన పదో ఓవర్ మూడో బంతికి ముష్ఫికర్ వికెట్ల ముందు ఎల్బీగా దొరికాడు. అయితే, భారత ఆటగాళ్లు ఎల్బీ కోసం అప్పీల్ చేసినా అంపైర్ స్పందించలేదు. ఆ సమయంలో రివ్యూ గనుక కోరినట్లైతే ముష్ఫికర్ ఔటయ్యేవాడు. కానీ, అలా చేయలేదు.
పంత్ ప్రోత్సాహంతో రోహిత్ శర్మ రివ్యూ
మరోవైపు చాహర్ ఓవర్లో చివరి బంతికి సర్కార్ క్యాచ్ ఔట్ కాకున్నా రిషబ్ పంత్ ప్రోత్సాహంతో రోహిత్ శర్మ రివ్యూ కోరాడు. అయితే, బంతి బ్యాట్‌ను తాకలేదని తేలడంతో రివ్యూ వృథా అయింది. క్రీజులో కుదురుకున్న సౌమ్య సర్కార్ 17వ ఓవర్లో ఔటైపోవడంతో బంగ్లా ఒత్తిడిలో పడగా ఆ తర్వాతి ఓవర్ మూడో బంతికే ముష్ఫికర్ కూడా వెనుదిరగాల్సింది.
ముష్ఫికర్ క్యాచ్‌ను పట్టిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా!
చాహల్ బౌలింగ్‌లో ముష్ఫికర్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద కృనాల్ పాండ్యా వదిలేశాడు. ఆ సమయంలో బంగ్లా విజయానికి 16 బంతుల్లో 35 పరుగులు కావాలి. కృనాల్ పాండ్యా గనుక ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications