పాండ్యా సర్జరీ సక్సెస్: త్వరలోనే జట్టుతో కలుస్తా, కానీ సమయం తెలియదు

హైదరాబాద్: గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు శనివారం లండన్‌లోని వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని పాండ్యానే స్వయంగా తన ఇనిస్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్ ఆడుతుండగా హార్దిక్ వెన్ను గాయంతో బాధపడ్డాడు.
నొప్పి భరించలేక నేలపై విలవిల్లాడిన సంగతి తెలిసిందే. అయితే, వెన్నునొప్పి గాయం మళ్లీ తిరగబెట్టడంతో పాండ్యాను బీసీసీఐ ఇటీవలే సర్జరీ నిమిత్తం లండన్‌కు పంపింది. ఆసియా కప్ తర్వాత తొలిసారి గాయపడినప్పుడు ఎవరైతే డాక్టర్ పాండ్యాకు చికిత్స అందించాడో అదే వైద్యుడు మళ్లీ హార్దిక్ పాండ్యాకు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
సర్జరీ సక్సెస్
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరిస్‌లో పాల్గొన్న పాండ్యా నేరుగా లండన్‌కు బయల్దేరి వెళ్లాడు. అక్కడ సర్జరీ విజయవంతంగా పూర్తైన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నాడు. "నా సర్జరీ విజయవంతం అయింది. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే జట్టుతో కలుస్తా, కానీ సమయం తెలియదు. అప్పటివరకూ నన్ను మిస్సవుతారు" అంటూ కామెంట్ పెట్టాడు.

వెన్నునొప్పి గాయంతో
సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న హార్దిక్‌ను వెన్నునొప్పి గాయంతో సతమతమయ్యాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కూడా హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకోలేపోయాడు. కూర్పులో భాగంగా హార్దిక్ టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వని సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020 ప్రారంభమయ్యే నాటికి జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.

త్వరలో భారత పర్యటనకు బంగ్లాదేశ్
భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటన ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. బంగ్లాతో సిరిస్‌కు కూడా పాండ్యా దూరమైనట్లే. తాజా, సర్జరీతో ఇకెంతకాలం క్రికెట్‌కు దూరమవుతాడో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లకు గాయం వేధించిన కారణంగానే పాండ్యా దూరం కాగా, విండిస్ పర్యటనకు విశ్రాంతినిచ్చారు.

టీ20 వరల్డ్‌కప్‌లో పాండ్యా కీలక ఆటగాడిగా
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యా కీలక ఆటగాడిగా ఉన్నాడు. దీంతో పాండ్యాకు టెస్టు క్రికెట్ కంటే కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే ఎక్కువ అవకాశాలు కల్పించాలని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ భావిస్తున్నారు. కాగా, భారత్ తరుపున ఇప్పటివరకు 40 టీ20 మ్యాచ్‌లాడి 310 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications