హార్దిక్ కొడుకును చూసి కృనాల్ ఖుషి.. బడే భాయ్ నీ ముచ్చటేంది అంటున్న ఫ్యాన్స్!

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అతని ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. శనివారం తన వారసుడి తొలి ఫొటోను హార్దిక్ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో కూడా పంచుకున్నాడు. ఆ ఫొటోకు 'దేవుడి దీవెన' అంటూ క్యాప్షన్‌‌గా పేర్కొన్నాడు. అభిమానులు కూడా స్టార్ ఆల్‌రౌండర్‌కు విషెస్ తెలియజేశారు.

అయితే తాజాగా హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా చిన్నారితో దిగిన ఫొటోను షేర్ చేశాడు. బ్రదర్‌ సన్‌ను చూసి ఆనందంతో పరవశించిపోయాడు. తన తమ్ముడి జంటకు అభినందనలు తెలియజేస్తూ.. తన సంతోషాన్ని అక్షరాల రూపంలో అభిమానులతో పంచుకున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన కృనాల్.. 'ఈ సంతోషాన్ని పదాలతో వర్ణించలేం. మా ఇంట్లో ఇప్పటి వరకు నేను పెద్దోడిని. కానీ ఇప్పటి నుంచి ఈ అందాల బుడ్డోడు పెద్దోడు. కంగ్రాట్స్ భాయ్ అండ్ నటాషా.., చిన్నోడా.. ఈ పెద్దనాన్న నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడురా 'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

అన్నా.. నువ్వెప్పుడే..

ఇక ఈ పోస్ట్‌కు ఫిదా అయిన అభిమానులు పాండ్యా బ్రదర్స్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. జూనియర్ పాండ్యా ఆగయా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు కృనాల్‌ను టార్గెట్ చేస్తూ.. నువ్వెప్పుడు తండ్రి అయితావ్? అని ప్రశ్నిస్తున్నారు. ‘మీ తమ్ముడు టీ20 ఆడుతుంటే.. నీవు ఇంకా టెస్ట్ ఆడుతున్నావ్'అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు. ఇక హార్దిక్ కన్నా ముందే కృనాల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలైన పంఖూరి శర్మ‌ను 2017లోనే వివాహం చేసుకున్నాడు.

పెళ్లి కాకుండానే పేరెంట్స్..

పెళ్లి కాకుండానే పేరెంట్స్..

ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్ధం చేసుకున్నామని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన హార్దిక్-నటాషా.. లాక్‌డౌన్‌ ప్రారంభంలో త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నామని వెల్లడించింది. అంతలోనే ఓ పిల్లాడికి జన్మనిచ్చింది. అయితే ఈ జంట దండలు మార్చుకున్న ఫొటో ఒకటి వైరల్ కాగా.. వీరి పెళ్లిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే పెళ్లికాకుండానే పేరెంట్స్ అయ్యారని అందరూ భావిస్తున్నారు. కొందరూ మాత్రం వారి వివాహం మేలో జరిగిందంటున్నారు.

‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని హార్దిక్‌ అప్పట్లో సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

వెన్ను గాయంతో దూరమై..

వెన్ను గాయంతో దూరమై..

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీకి సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్‌ కారణంగా అది రద్దవ్వడంతో స్టార్ ఆల్‌రౌండర్ పునరాగమనం ఆలసమైంది.

దేశవాళీ టోర్నీలో వీరవిహారం..

దేశవాళీ టోర్నీలో వీరవిహారం..

ఇక తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో పాండ్యా రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీ డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బీపీసీఎల్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ సాధించిన హార్దిక్‌.. ఓవరాల్‌గా 55 బంతుల్లో 20 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 158 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అంతకుముందు కాగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు.

ఇక్కడ కూడా 39 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. ఇందులో 10 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉండటం విశేషం. ఇక బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో జరిగిన తన రీఎంట్రీ ఆరంభపు మ్యాచ్‌లో 25 బంతుల్లో ఒక ఫోర్‌, నాలుగు సిక్స్‌లతో 38 పరుగులు సాధించి తన సత్తా చాటాడు.

నన్ను ఆ మాటంటే సెహ్వాగ్ బతికేవాడా? మైదానంలోనే కొట్టేవాడిని: షోయబ్ అక్తర్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, August 2, 2020, 15:43 [IST]
Other articles published on Aug 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X