For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనత: భారత్ తరుపున మూడో అన్నదమ్ముల జోడీగా పాండ్యా సోదరులు

By Nageshwara Rao
Pandya Brothers To Create An Unique Record In England
Krunal and Hardik Pandya to be third brother duo to represent Team India

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మంగళవారం మాంచెస్టర్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో పాండ్యా సోదరులు అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా తరుపున ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో కలిసి ఆడటం ఇదే తొలిసారి.

దీంతో ఈ అన్నదమ్ముల జోడీకి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన మూడో జోడీగా అరుదైన గుర్తింపు లభించింది. అంతకముందు టీమిండియా తరుపున మొహిందర్ అమర్నాథ్-సురేందర్ అమర్నాథ్‌..... ఇర్పాన్ పఠాన్-యూసఫ్ పఠాన్‌లతో కూడిన అన్నదమ్ముల జోడీ ఆడారు.

ఐపీఎల్‌లో కృనాల్ పాండ్యా చక్కటి ప్రదర్శన

ఐపీఎల్‌లో కృనాల్ పాండ్యా చక్కటి ప్రదర్శన

పాండ్యా సోదరులు ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో మంచి ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న కృనాల్ పాండ్యా నిన్నటివరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అంతేకాదు ఐపీఎల్‌లో 39 మ్యాచ్ లాడి 28.32 యావరేజితో 793 పరుగులు చేశాడు. బౌలింగ్ విషయానికి వస్తే 28 వికెట్లు తీశాడు.

టీమిండియా తరుపున నిలకడగా రాణిస్తోన్న హార్దిక్ పాండ్యా

టీమిండియా తరుపున నిలకడగా రాణిస్తోన్న హార్దిక్ పాండ్యా

ఇక, కృనాల్ పాండ్యా సోదరుడు హార్ధిక్ పాండ్యా అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లో కూడా టీమిండియా తరుపున నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ తరుపున హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 7 టెస్టులు, 38 వన్డే మ్యాచ్‌లాడాడు. ఇక, వన్డేల్లో 39 వికెట్లు తీసుకోగా.. టెస్టుల్లో 7 వికెట్లు తీసుకున్నాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సెంచరీ కూడా నమోదు చేశాడు.

ఒకే ఒక్క సెంచరీ చేసిన సురీందర్ అమర్నాథ్

ఒకే ఒక్క సెంచరీ చేసిన సురీందర్ అమర్నాథ్

భారత్ తరుపున టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన లాల్ అమర్నాథ్ కుమారులే మొహిందర్ అమర్నాథ్, సురీందర్ అమర్నాథ్. సురీందర్ అమర్నాథ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌ని ప్రారంభించాడు. తన క్రికెట్‌లో సురీందర్ అమర్నాథ్ చేసిన ఏకైక సెంచరీ ఇదే. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సురీందర్ కేవలం 10 టెస్టులు, 3 వన్డేలు మాత్రమే ఆడాడు.

 మొహిందర్ అమర్నాథ్

మొహిందర్ అమర్నాథ్

ఇక, మొహిందర్ అమర్నాథ్ విషయానికి వస్తే భారత్ తరుపున 69 టెస్టులు, 85 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 2 సెంచరీలు సాధించాడు. 1983లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ట్రోఫీ నెగ్గిన భారత్ జట్టులో సభ్యుడు కూడా. క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తన పుస్తకం 'బుక్ ఐడల్స్' లో మొహందర్ అమర్నాథ్‌ను అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌గా కొనియాడాడు.

 యూసఫ్ పఠాన్

యూసఫ్ పఠాన్

భారత క్రికెట్ జట్టులో పఠాన్ సోదరులు ఆల్ రౌండర్లుగా నిరూపించుకున్నారు. 2007లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా పఠాన్‌కు గుర్తింపు ఉంది. వన్డేల్లో(113.60), టీ20ల్లో (146.58) స్ట్రయిక్ రేట్‌ని నమోదు చేశాడు. వన్డేల్లో యూసఫ్ పఠాన్ 33 వికెట్లు తీసుకున్నాడు. వాంఖడె వేదికగా 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యూసఫ్ పఠాన్ సభ్యుడిగా ఉన్నాడు.

ఇర్పాన్ పఠాన్

ఇర్పాన్ పఠాన్

ఇక, ఇర్ఫాన్ పఠాన్ విషయానికి వస్తే 2003లో భారత్ తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్ తరుపున 29 టెస్టు మ్యాచ్‌లు, 120 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టు క్రికెట్‌లో 100 వికెట్లతో పాటు ఒక సెంచరీని కూడా నమోదు చేశాడు. 2006లో కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ హ్యాట్రిక్ వికెట్లతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఇర్పాన్ పఠాన్ ప్రస్తుతం జమ్మూ, కాశ్మీర్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.

Story first published: Wednesday, July 4, 2018, 11:45 [IST]
Other articles published on Jul 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+