Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కృనాల్ పాండ్యా బాగా ఓవర్ చేశాడు.. పొలార్డ్ రియాక్ట్ అయితే పరిస్థితి వేరేలా ఉండేది

 krunal pandya send off is not proper when pollard in dissappointing stag

ముంబై ప్లేయర్ కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా.. ఇద్దరు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కృనాల్ 2016లో ముంబై జట్టులో చేరగా.. పొలార్డ్ పదేళ్లుగా ముంబై ఇండియన్స్ టీంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ గ్రౌండ్లో, బయట కూడా మంచి స్నేహితులుగా మెలిగేవారు. ఈ సీజన్లో కృనాల్ పాండ్యా లక్నోకు ఆడుతున్నాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్‌ను ఔట్ చేసిన తర్వాత కృనాల్ పాండ్యా అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చిన విధానం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 103నాటౌట్‌తో రాణించగా.. కృనాల్ మూడు వికెట్లు తీశాడు. లక్నో ప్లేయర్ల ప్రదర్శనకు ముంబై తన ఎనిమిదో ఓటమిని మూటగట్టుకుంది.



ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో కృనాల్.. పొలార్డ్‌ను ఔట్ చేశాడు. ఔటయిన పొలార్డ్ పెవిలియన్ వెళ్లిపోతుండగా.. కృనాల్ ఎగిరి మరీ పొలార్డ్ మీద పడి ముద్దు పెడుతూ వెళ్లు.. వెళ్లు అంటూ సెండాఫ్ ఇచ్చాడు. అతను చాలా సరదాగా చేసినప్పటికీ.. ఏమాత్రం స్పందించకుండా కీరన్ పొలార్డ్ సైలెంట్‌గా డగౌట్ వైపు వెళ్లిపోయాడు. కృనాల్ చేసిన పనికి చాలా మంది అభిమానులు అతను కాస్త ఓవర్ చేశాడంటూ పేర్కొంటున్నారు. ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ పార్థివ్ పటేల్ కూడా ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. కృనాల్ సంబరాలు ఓవర్‌గా ఉన్నాయన్నాడు. 'కృనాల్, పొలార్డ్ చాలా మంచి స్నేహితులు, కానీ ప్రస్తుతం పొలార్డ్ పరిస్థితి వేరే ఉంది. పొలార్డ్ సరిగా స్కోరు చేయడం లేదు. ముంబై జట్టు కూడా వరుసగా ఓటములతో నిరాశ చెంది ఉంది. ఇలాంటి టైంలో స్నేహితులైనా.. సరదాగా ఆటపట్టించడం, సెండాఫ్ ఇవ్వడం చేయకూడదు. పొలార్డ్‌కు స్పేస్ ఇవ్వాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు ఎంతైన పరిహాసాలు ఆడుకోవచ్చు. కానీ గ్రౌండ్లో, వేలాది మంది చూస్తుండగా , కోట్లాది మంది ముంబై అభిమానులు టీవీ చూస్తుండగా.. ఇలాంటి సంబరాలు సరికాదని నేను భావిస్తున్నా" అని పార్థివ్ క్రిక్‌బజ్‌తో అన్నాడు.
 krunal pandya send off is not proper when pollard in dissappointing stag

మాజీ టీమిండియా పేసర్ ఆర్పీ సింగ్ కూడా కృనాల్.. పొలార్డ్‌కు ఇచ్చిన సెండ్-ఆఫ్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. 'పొలార్డ్ మౌనంగా వెళ్లిపోయాడు కాబట్టి సరిపోయింది. ఓటమి బాధలో అతను వేరేలా స్పందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకంటే ఓడిపోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఫామ్ బాగా లేనప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఓ ప్లేయర్ పట్ల ఎంత స్నేహమున్న అలా ప్రవర్తించకూడదు. నా ప్రకారం.. కృనాల్ బాగా ఓవర్‌గా ప్రవర్తించాడు.' అని పేర్కొన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం కృనాల్ మాట్లాడుతూ.. 'నేను పొలార్డ్‌ను ఔట్ చేసినందుకు చాలా సంతోషపడ్డా. లేకుంటే నా మెదడును తినేవాడు. ఎందుకంటే అతను అంతకుముందు నన్ను ఔట్ చేశాడు. ఇక ఇప్పుడు 1-1తో లెక్క బ్యాలెన్స్ అయింది.' అని తెలిపాడు.

Story first published: Monday, April 25, 2022, 15:30 [IST]
Other articles published on Apr 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+