ఒకే మ్యాచ్: బ్యాట్‌తో 134 పరుగులు.. బంతితో 8 వికెట్లు!!

బెంగళూరు: ఒక మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ సెంచరీ చేయడం లేదా బౌలర్ ఐదు వికెట్ల హాల్ సాధించడం సహజం. సెంచరీ చేసి.. రెండు మూడు వికెట్లు సాధించడం అరుదు. ఇక టీ20 మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఏకంగా 8 వికెట్లు తీయడం రికార్దే. ఇలాంటి సంచల ప్రదర్శనను భారత ఆటగాడు కృష్ణప్ప గౌతమ్ నమోదు చేసాడు. బెంగళూరులో జరుగుతన్న కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో గౌతమ్ చరిత్ర సృష్టించాడు.
39 బంతుల్లో సెంచరీ:
కేపీఎల్‌లో బళ్లారి టస్కర్స్ తరఫున ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్ బ్యాట్‌తోనూ, బంతితోనూ అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు శివమొగ్గ లయన్స్‌కు పట్టపగలే చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో 134 పరుగులు (నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో 13 సిక్సులు, ఏడు ఫోర్లు ఉన్నాయి. బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 39 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ కేపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

నాలుగు ఓవర్లు 8 వికెట్లు:
కృష్ణప్ప గౌతమ్ బంతితోనూ మెరిశాడు. పదునైన బంతులతో శివమొగ్గ లయన్స్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. కేవలం నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు తీసాడు. గౌతమ్ సంచలన ప్రదర్శనతో రికార్డు నెలకొల్పాడు. గౌతమ్ తన జట్టును 70 పరుగుల తేడాతో గెలిపించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికయ్యాడు. గౌతమ్ బౌండరీల ద్వారా 106 పరుగులు సాధించడం విశేషం.

రికార్డులు బద్దలు:
39 బంతుల్లో సెంచరీ సాధించి కేపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన క్రికెటర్‌గా గౌతమ్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే. ప్రస్తుత కేపీఎల్ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు (13) కొట్టిన రికార్డు కూడా గౌతమ్ పేరిటే నమోదయింది. కృష్ణప్ప గౌతమ్ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. 2019లో కూడా ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications