For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు ఎంపికవాలనేది ఎన్నో ఏళ్ల కల!అందుకే నన్ను భజ్జీ అని పిలిచేవారు!ధోనీ అమూల్యమైన సలహా ఇచ్చాడు!

Krishnappa Gowtham says My dream is to play for Team India, Finally it has come true

బెంగళూరు: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత​ సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్‌ ప్లేయర్ శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో టీమిండియా-బీ జట్టు లంకతో సిరీస్‌ ఆడనుంది. ఐపీఎల్‌, దేశవాలీ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు శ్రీలంక పర్యటనలో బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. రుతురాజ్‌ గైక్వాడ్, దేవదత్‌ పడిక్కల్‌, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, నితీష్‌ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణప్ప గౌతమ్‌ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఎన్నో ఏళ్ల కల:

ఎన్నో ఏళ్ల కల:

'టీమిండియాకు ఎంపిక కావాలనేది ఎన్నో ఏళ్ల కల. ఇప్పుడు అది నెరవేరింది. ఇంత కంటే ఆనందమైన విషయం మరొకటి ఉండదు. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తా. నా కెరీర్‌ ఆరంభంలో హర్భజన్‌ సింగ్‌ని అనుసరించేవాడిని. దాంతో నా సహచర ఆటగాళ్లు నన్ను భజ్జీ అని పిలిచేవారు. అయితే హర్భజన్‌లాగా నేను దుస్రా వేయను కానీ క్యారమ్‌ బాల్ వేస్తా. క్యారమ్‌ బాల్‌ సంధించడం రవిచంద్రన్‌ అశ్విన్‌ను చూసి నేర్చుకోలేదు. నా సొంతంగా నేర్చుకున్నా. మనం రాణించాలంటే సొంతంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. నా చిన్నతనంలో ఎర్రపల్లి ప్రసన్న సర్‌ కూడా నాకు శిక్షణ ఇచ్చారు. అయితే అశ్విన్‌ ఆలోచన విధానం, అతడి ఆటతీరును ఇష్టపడతాను' అని గౌతమ్‌ తెలిపాడు.

 మహీ అమూల్యమైన సలహా ఇచ్చాడు:

మహీ అమూల్యమైన సలహా ఇచ్చాడు:

ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంచైజ్ కృష్ణప్ప గౌతమ్‌ని 9.25 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ ఈ సీజన్‌లో కృష్ణప్పకు ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. 'ఐపీఎల్‌లో నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఆట విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు. ధర గురించి పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి. ఆటను ఎప్పుడూ ఎంజాయ్‌ చేయాలని మహీ భాయ్ (చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ) అమూల్యమైన సలహా ఇచ్చాడు. నీ సహజమైన శైలిలో ఆడు అని ఎప్పుడూ చెప్పేవాడు. మహీ సలహాలను ఆచరణలో పెడుతా. బాగా రాణించేందుకు ప్రయత్నిస్తా' అని గౌతమ్‌ చెప్పుకొచ్చాడు.

అదో గొప్ప అనుభవం:

అదో గొప్ప అనుభవం:

ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టులకు కృష్ణప్ప గౌతమ్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆ సమయంలో సీనియర్‌ జట్టుతో కలిసి ఉండటంపై స్పందిస్తూ... 'దేశంలోని నాణ్యమైన ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం గొప్ప అనుభవం. దీని ద్వారా ఎంతో నేర్చుకున్నా' అని అన్నాడు. కర్ణాటక తరఫున దేశవాళీ క్రికెట్‌లో గౌతమ్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్ల ఘనతను 12 సార్లు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాట్‌తోనూ రాణించి ఆల్‌రౌండర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. దీనిపై మాట్లాడుతూ.. 'దేశవాళీ క్రికెట్‌లో బలమైన జట్టుగా ఉన్న కర్ణాటక తరఫున ఆడటం ఎంతో ఉపయోగపడింది. ఇది బలమైన జట్టే కాకుండా చాలా ఆనందంగా ఉండే జట్టు' అని పేర్కొన్నాడు.

ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం సులభం:

ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం సులభం:

శ్రీలంక పర్యటనకు జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో ద్రవిడ్‌ ఇండియా 'ఏ' జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. అప్పుడు గౌతమ్ జట్టులో ఉన్నాడు. అందుకే ద్రవిడ్‌తో కలిసి పనిచేయడం ఇప్పుడు సులభంగా ఉంటుందని గౌతమ్‌ చెప్పాడు. 'నేను ఇండియా -ఏకు ఆడినప్పుడు ద్రావిడ్‌ సర్ మాకు కోచ్‌గా ఉన్నారు. ఆయన ఏం ఆశిస్తాడో ఆటగాడిగా నాకు తెలుసు. ఇంతకుముందు అతని దగ్గర శిష్యుడిగా ఉండటం ఈ పర్యటనలో నాకు ఎంతో ఉపయోగపడుతుంది' అని కృష్ణప్ప గౌతమ్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, June 12, 2021, 10:50 [IST]
Other articles published on Jun 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+