Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఆ విషయంలో ఇద్దరు ఒక్కటే.. కోహ్లీని కపిల్‌తో పోల్చొచ్చు'

Krishnamachari Srikkanth says Virat Kohli can be compared with Kapil Dev


ఢిల్లీ:
ఆత్మవిశ్వాసం, పోరాటపటిమలో ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌తో పోల్చొచ్చని బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌, మాజీ సారథి కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన కపిల్ దేవ్‌కి కోహ్లీకి ఎన్నో పోలికలు ఉన్నాయన్నారు. ఇద్దరిది ఓటమి ఒప్పుకొనే మనస్తత్వం కాదని చెప్పిన ఆయన.. ఇద్దరికి ఎంతో మనో ధైర్యం ఉందని తెలిపారు.
 కోహ్లీని కపిల్‌తో పోల్చొచ్చు:

కోహ్లీని కపిల్‌తో పోల్చొచ్చు:

ఇటీవల స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో కృష్ణమాచారి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. 'నేను కపిల్‌ దేవ్‌తో కలిసి క్రికెట్ ఆడాను. అంతేకాక.. కోహ్లీని ఎంపిక చేసిన సెలెక్షన్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించా. కపిల్‌, కోహ్లీని దగ్గరి నుండి గమనించా. వాళ్లిద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరి ప్రవర్తించే విధానాలు ఒకేలా ఉంటాయి' అని అన్నారు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ అందించిన జట్టులో శ్రీకాంత్ కూడా ఉన్నారు. ఇక భారత్‌కు రెండోసారి (2011) ప్రపంచకప్‌ తెచ్చిన జట్టులో కోహ్లీ ఉన్నాడు.

 ఓటమిని ఒప్పుకోరు:

ఓటమిని ఒప్పుకోరు:

'కపిల్‌, కోహ్లీల ఇద్దరికి అంతులేనంత మనో ధైర్యం ఉంది. వాళ్ల లక్ష్యం కేవలం విజయం సాధించడమే. ఓటమిని ఒప్పుకొనే మనస్తత్వం వారిలో మనకు కనిపించదు. పైగా లక్ష్య ఛేదన సమయంలో ఇద్దరు దూకుడుగా ఆడుతారు. అందుకే విరాట్ కోహ్లీని.. చూస్తుంటే నాకు కపిల్ దేవ్‌ని చూసినట్టే అనిపిస్తుంది. సానుకూల దృక్పథం విషయంలో కపిల్‌, కోహ్లీ ఒకేలా కనిపిస్తారు' అని శ్రీకాంత్ పేర్కొన్నారు. 'క్రికెట్ కనెక్టెడ్'లో టీమిండియా మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ కూడా పాల్గొన్నారు.

 ఎక్కడైనా పరుగులు చేయగలడు:

ఎక్కడైనా పరుగులు చేయగలడు:

'ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆటను మార్చగల సామర్థ్యం విరాట్ కోహ్లీకి ఉంది. ఎక్కడైనా పరుగులు చేయగలడు. లక్ష్య ఛేదనలో కోహ్లీ మరింత ఆకలిగా ఉంటాడు. క్రీజులకి వచ్చాడంటే పరుగులు చేయడమే అతడి లక్ష్యం. ఈ లక్షణాలే కోహ్లీని ప్రపంచంలోని ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచేలా చేసాయి. మంచి నాయకత్వ లక్ష్యాలు ఉన్నాయి. జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. కోహ్లీలో నేను ఇష్టపడే విషయం అతనికి ఆటపట్ల ఉండే అంకితభావం' అని లక్ష్మణ్ అన్నారు. అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సగటు 50కి పైగా ఉంది. టెస్టుల్లో 53.62 సగటుతో 7,240 పరుగులు.. వన్డేలలో 60 సగటుతో 11,867 పరుగులు చేశాడు.

Story first published: Monday, April 13, 2020, 10:07 [IST]
Other articles published on Apr 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+