ఆ ప్లేయర్ ను ఆడిస్తే RCB కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే
నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మ్యాచ్ ఆడబోతోంది. గుజరాత్ టైటాన్స్ తో తలపడబోతోంది. బెంగళూరు దీనికి వేదిక. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ కు ఇదే చివరి మ్యాచ్. ఇకపై ఆడే మ్యాచ్ లన్నీ కూడా అవుటాఫ్ బెంగళూరే. దీంతో ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించి సొంతగడ్డకు వీడ్కోలు చెప్పాలనే పట్టుదలతో ఉంది రజత్ పటిదార్ సేన.
ఈ మ్యాచ్ పై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలహీనతల గురించి వివరించాడు. జట్టు అయిదో బౌలర్ సమస్యను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ బౌలింగ్‌పై శ్రీకాంత్ విమర్శలు చేశాడు. బౌలింగ్ అటాకింగ్ సరిగ్గా లేకపోతే గుజరాత్ టైటాన్స్ నుంచి ఆర్సీబీకి ముప్పు ఎదురవుతుందని, అందుకే ఆచితూచి ప్లేయింగ్ 11ను ఎంపిక చేసుకోవాలని సూచించాడు.

ఆర్సీబీపై అద్భుతంగా ఆడిన రికార్డు గుజరాత్ టైటాన్స్ కు ఉందని గుర్తు చేశాడు. జోస్ బట్లర్ రాణిస్తే బెంగళూరు పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. రొమారియో షెపర్డ్ వద్ద ఆర్సీబీ బౌలింగ్ బలహీనపడుతోందని అన్నాడు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్నప్పటికీ, షెపర్డ్ తన రెండు ఓవర్లలో ప్రత్యర్థులకు మ్యాచ్‌ను బహుమతిగా ఇస్తున్నాడని ఎద్దేవా చేశాడు. తోటి బౌలర్ల శ్రమ ఇక్కడ నేలపాలవుతోందని వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ బలంగా ఉందని, అలాగని గుజరాత్ టైటాన్స్ ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించాడు.
ఆర్సీబీ చేతి నుంచి మ్యాచ్ జారిపోతే ఆ చిన్న తప్పిదం మున్ముందు పెద్ద సమస్యగా మారుతుందని శ్రీకాంత్ స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలుస్తుందని తాను భావిస్తున్నానని చెప్పాడు. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్, గిల్ కలిసి శుభారంభాన్ని ఇస్తారని, జోస్ బట్లర్ ఆర్సీబీ బౌలింగ్ భరతం పడతారని వ్యాఖ్యానించాడు. ఈ ముగ్గురూ రాణిస్తే, ఆర్సీబీ పనైపోయినట్లేనని జోస్యం చెప్పాడు.గుజరాత్ టైటాన్స్ కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉందని, ఫామ్ కోల్పోయిన గ్లెన్ ఫిలిప్స్‌ను తొలగించి, వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications