Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KPL fixing: సుధీంద్ర షిండేను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

KPL fixing: Crime Branch arrests Sudhindra Shinde

హైదరాబాద్: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు మాజీ కర్ణాటక రంజీ ప్లేయర్, మాజీ బెళగావి పాంథర్స్ కోచ్ సుధీంద్ర షిండేను బుధవారం(డిసెంబర్ 4)న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

షిండే ప్రస్తుతం కర్ణాటక అండర్ -19 జట్టు కోచ్‌గా విధులు నిర్వహించడంతో పాటు రాయచూర్ జోన్ నుండి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. సిటీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం షిండేని అదుపులోకి తీసుకున్నాడు.

కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో తాజాగా అరెస్ట్ అయిన వారిలో 39 ఏళ్ల షిండే ఒకడు. డెక్కెన్ హెరాల్డ్‌లో ప్రచురించిన వార్తా కథనం ప్రకారం షిండే తన అసోసియేషన్ టీమ్ ఓనర్ అలీ ఆస్ఫక్ తారాతో కలిసి కేపీఎల్‌లో పలు మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

జాయింట్ కమిషన్ ఆఫ్ పోలీసు(క్రైమ్) సందీప్ పాటిల్ మాట్లాడుతూ బుధవారం షిండేను మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ ఫిక్సింగ్‌లో అతడితో పాటు మరెవరైనా ఉన్నారనే విషయాలను కనుగొనేందుకు అతడిని కష్టడీకి కోరుతామని చెప్పారు.

అంతకముందు షిండేకు బిజాపుర్ బుల్స్‌తో కూడా అనుబంధం ఉంది. షిండే, తారాకు ముందు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావేష్ భప్నా(ఫాంథర్స్ డ్రమ్మర్), బెంగళూరు బ్లాస్టర్స్ ఆటగాళ్లు నిషాంత్ సింగ్ షెకావత్, ఎమ్ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ విను ప్రసాధ్, బళ్లారి టస్కర్స్ కెప్టెన్ సీఎమ్ గౌతమ్ తదితరులను అరెస్ట్ చేశారు.

Story first published: Wednesday, December 4, 2019, 12:10 [IST]
Other articles published on Dec 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+