కేపీఎల్‌లో సరికొత్త రికార్డు: 56 బంతుల్లో 134 నాటౌట్.. 4 ఓవర్లు 8 వికెట్లు

హైదరాబాద్: కృష్ణప్ప గౌతమ్ తనలోని అసలు సిసలైన ఆల్ రౌండర్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో బళ్లారి టస్కర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న కృష్ణప్ప గౌతమ్ అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు.
కేపీఎల్ టోర్నమెంట్ చరిత్రలోనే
తద్వారా కేపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. 39 బంతుల్లో సెంచరీ సాధించిన కృష్ణప్ప గౌతమ్ మొత్తం 56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా కేపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును నెలకొల్పాడు.
బౌండరీలతోనే సెంచరీకి పైగా పరుగులు
బౌండరీలతోనే కృష్ణప్ప గౌతమ్ సెంచరీకి పైగా పరుగులు సాధించడం విశేషం. గౌతమ్ అద్భుత ఇన్నింగ్స్‌తో బళ్లారి టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శివమొగ్గ లయన్స్‌ను తన బౌలింగ్‌తో తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.
15 పరుగులిచ్చి 8 వికెట్లు
నాలుగు ఓవర్లు వేసిన గౌతమ్ 15 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా కేపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గౌతమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో శివమొగ్గ లయన్స్‌పై 70 పరుగుల తేడాతో బళ్లారి టస్కర్స్ విజయం సాధించింది.
‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్'గా కృష్ణప్ప గౌతమ్
16.3 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌటైంది. బలాల్(40), దేశ్‌పాండే(46) మినహా మిగతా ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కృష్ణప్ప గౌతమ్ ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications