Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపియల్ కు భద్రత: కోమటిరెడ్డి లేఖ

Komtireddy Venkatareddy
హైదరాబాద్: హైదరాబాదులో ఐపియల్ మ్యాచులకు పూర్తి భద్రత కల్పిస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఐపియల్ నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. ఐపియల్ మ్యాచులకు వచ్చే క్రీడాకారులకు, నిర్వహకులకు తదితరులకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఐపియల్ మ్యాచులకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఐపియల్ - 3 ప్రారంభోత్సవ కార్యక్రమం ముంబైకి తరిలి వెళ్లినట్లు తెలుస్తోందని, నిర్వాకులు దాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. అవసరమైతే తాము తెలంగాణ నాయకులతో మాట్లాడుతామని ఆయన చెప్పారు. ఐపియల్ నిర్వాహకులు ముఖ్యమంత్రి రోశయ్యతో గానీ తనతో గానీ మాట్లాడలేదని ఆయన చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+