Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్‌లో రెండో టెస్ట్: రెండు సెషన్లు వాళ్లవి, ఒకటి మనది

కోల్ కత్తా: ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలిరోజును భారత్‌ నిరాశగా ముగించింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ ఏడు వికెట్ల కోల్పోయి 239 పరుగులు చేసింది. క్రీజులో వృద్ధిమాన్‌ సాహా 14 పరుగులు, రవీంద్ర జడేజా 0 పరుగులతో ఉన్నారు.

సొంతగడ్డపై 250వ టెస్టు మ్యాచ్‌. కెప్టెన్‌ కోహ్లి టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. గాయపడిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ధావన్‌ కేవలం ఒక్క పరుగుకే అవుటయ్యాడు. రెండో ఓవర్‌లోనే అవుటయ్యాడు. ఫాంలో ఉన్న విజయ్ కూడా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన కోహ్లి (9) కూడా వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి ఫీల్డర్‌ లాథమ్‌ చేతికి చిక్కాడు. పుజారా (2019 బంతుల్లో 87 పరుగులతో రాణించాడు అజింక్యా రహానె (157 బంతుల్లో 77 పరుగులతో రాణించాడు. వీరు నాలుగో వికెట్‌కి 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆ తర్వాత పుజారాను వాగ్నర్‌, రహానెను పటేల్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ మళ్లీ తడబడింది. రోహిత్‌ శర్మ తనకు కలిసొచ్చిన మైదానంలో కేవలం రెండు పరుగులే చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌ (33 బంతుల్లో 26 చేశాడు. తొలి సెషన్లో, మూడో సెషన్లో భారత్ తడబడింది. రెండో సెషన్లో మాత్రమే ఆధిపత్యం కనబర్చింది. కివీస్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు తీయడంతో భారత్ ఒత్తిడిలో పడింది.

పుజారా 87 ఔట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో రహానే, పుజారా ఇద్దరూ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. ఆ తర్వాత 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పూజారా ఔట్ అయ్యాడు. పుజారా, రహానే హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

దీంతో భారత్ 69.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 187 పరుగులు చేసింది. శుక్రవారం ఉదయం 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రహానే, పూజారాతో కలిసి స్కోరు బోర్డుని పరుగులెత్తించి, కివీస్ బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేశారు.

Kolkata Test: India win toss against New Zealand, elect to bat first

అర్ధ సెంచరీ చేసిన రహానే

రహానే హాఫ్ సెంచరీతో అలరించాడు. కోహ్లీ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రహానే చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. డిపెండబుల్ బ్యాట్స్‌మన్ పుజారాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నా వీరిద్దరూ వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలిచారు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్‌కు అజేయంగా శతక భాగస్వాయ్యం నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ 65 ఓవర్లలో 155/3 పరుగులు చేసింది. పుజారా 73, రహానే 55 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఆదుకున్న పుజారా, రహానే

కష్టాల్లో ఉన్న టీమిండియాను పుజారా, రహానేలు ఆదుకున్నారు. జట్టు స్కోరు 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరును పరిగెత్తిస్తున్నారు. ఈ క్రమంలో పుజారా అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో అతనికిది వరసగా మూడో హాఫ్ సెంచరీ.

దీంతో 51 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా 115 పరుగులు చేసింది. ఇద్దరూ కలిసి అర్దసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పుజారా 56, రహానే 34 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

లంచ్ విరామ సమయానికి టీమిండియా 57/3

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టపోయి 57 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా (31), రహానే (2) ఉన్నారు.

ఈడెన్ పిచ్ పేస్ బౌలర్లకు సహకరించడంతో కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 9 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. రెండో ఓవర్‌లో ధావన్ ఔట్ అవడంతో టీమిండియా కష్టాలు మొదలయ్యాయి.

టీమిండియా బ్యాట్స్ మెన్లను కివీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ఫామ్‌లో ఉన్న విజయ్, ఫామ్ లేని విరాట్ కోహ్లి కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.

రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఓపెనర్లు ధావన్ (1), విజయ్ (9) ఇద్దరూ పెవిలియన్ చేరారు. దీంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రెండో టెస్టులో జట్టులోకి వచ్చిన కివీస్ బౌలర్ హెన్రీయే ఈ రెండు వికెట్లు తీసుకోవడం విశేషం.

క్రికెట్ మక్కాగా భావించే లార్డ్ మైదానం తరహాలో ఈడెన్ గార్డెన్స్‌లో తొలిసారి ప్రత్యేకంగా గంటను ఏర్పాటు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించాడు. స్వదేశంలో టీమిండియాకు ఇది 250 టెస్టు కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయం కారణంగా టెస్టు సిరిస్‌కు దూరమైన ఓపెనర్ కెఎల్ రాహుల్ స్థానంలో శిఖర్ ధావన్ తుది జట్టులో చోటు కల్పించారు. కాన్పూర్ టెస్టులో అంతగా రాణించని పేసర్ ఉమేష్ యాద‌వ్ స్థానంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను తీసుకున్నారు.

స్పిన్నర్ అమిత్ మిశ్రాకు మరోసారి నిరాశే ఎదురైంది. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న గౌతం గంభీర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక న్యూజిలాండ్ జట్టులో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ విలియ‌మ్స‌న్ జ్వ‌రం కార‌ణంగా మ్యాచ్‌కు దూర‌మయ్యాడు.

అత‌ని స్థానంలో తుది జట్టులో నికోల్స్‌కు చోటు కల్పించారు. రాస్ టేల‌ర్ న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇదిలా ఉంటే వరుసగా 12 టెస్టుల్లో 10 విజయాలతో జోరుమీదున్న భారత్‌ ఈడెన్‌లో విజయం సాధిస్తే టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+