Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్‌లో తొలి టెస్ట్, డే 4: ధావన్ సెంచరీ మిస్, 37 ఏళ్ల తర్వాత సీమర్లు అద్భుత రికార్డ్

Kolkata Test, Day 4, Live: Sri Lanka take lead but Shami, Bhuvneshwar wreak havoc

కోల్‌కతా:శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 116 బంతుల్లో 94 పరుగులు చేశాడు.

సెంచరీకి చేరువలో అతను అవుటయ్యాడు. 37వ ఓవర్లో శనక వేసిన బంతిని ధావన్‌ ఆడాడు. బ్యాట్‌ అంచుకు తాకిన బంతి నేరుగా కీపర్‌ డిక్వెలా చేతుల్లో పడింది.

మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ కూడా వేగంగా ఆడాడు. అతను 113 బంతుల్లో 73 పరుగులు చేశాడు. చటేశ్వర పుజారా 9 బంతుల్లో 2 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెలుతురు తక్కువగా ఉండటంతో మ్యాచ్‌‌ను నిలిపేశారు. టీమిండియా 171/1తో ఉంది.

అంతకుముందు, 165 పరుగులకు నాలుగు వికెట్ల ఓవర్ నైట్ స్కోర్‌తో శ్రీలంక నాలుగో రోజైన ఆదివారం ఉదయం బ్యాటింగ్ ప్రారంభించింది. డిక్ వెలా, చండీమల్ జోడి మంచి ఆరంభాన్నే ఇచ్చారు.

శ్రీలంక 294 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 172 పరుగులకే ఆలౌటైంది.

రికార్డ్ సృష్టించిన సీమర్లు

ఈడెన్‌లో భారత సీమర్లు అరుదైన రికార్డు సృష్టించారు. పది వికెట్లు సీమర్లు తీశారు. స్పిన్నర్లకు ఒక్క వికెట్ దక్కలేదు. 37 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. మొత్తంగా మూడోది.

Story first published: Sunday, November 19, 2017, 17:01 [IST]
Other articles published on Nov 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+