For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతా టెస్టు, డే 3: ఎట్టకేలకు అవుటయ్యారు, ఫలించిన కోహ్లీ వ్యూహం

కోల్‌కతాలోనీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక నాలుగో వికెట్‌ కోల్పోయింది.

By Nageshwara Rao
Kolkata Test, Day 3: Umesh Yadav breaks Mathews-Thirimanne alliance

హైదరాబాద్: కోల్‌కతాలోనీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక నాలుగో వికెట్‌ కోల్పోయింది. భారత బౌలింగ్‌ని సమర్ధవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీలు సాధించిన శ్రీలంక బ్యాట్స్‌మెన్లు లాహిరు తిరుమన్నే(51), ఏంజెలో మాథ్యూస్‌ (52) ఐదు పరుగుల వ్యవధిలోనే ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపించాడు.

ఉమేష్ వేసిన 36 ఓవర్ తొలి బంతికే థర్డ్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత బౌండరీతో హాఫ్ సెంచరీ సాధించిన ఏంజెలో మాథ్యూస్‌ (52) 38.5వ బంతికి ఫీల్డర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

దీంతో 37 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక కెప్టెన్ దినేశ్‌ చండిమాల్‌ (1), నిరోషన్‌ డిక్వెలా (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. 45 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఓపెనర్లు పెద్దగా రాణించకపోయినా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మాజీ కెప్టెన్ మాథ్యూస్(52), తిరుమన్నే(51) నిలకడగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు. కాగా మూడో రోజు వెలుతురు లేని కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ సమయానికి లంక 45.4 ఓవర్లకి 165 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో కెప్టెన్ చంఢిమాల్(13), డిక్వెలా(14) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఇంకా 7 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Saturday, November 18, 2017, 16:26 [IST]
Other articles published on Nov 18, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+