For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతులెత్తేసిన కివీస్ టాప్ ఆర్డర్: 128/7, భారత్ 316 ఆలౌట్

By Nageshwara Rao

కోల్‌కత్తా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 316 పరగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ రెండో రోజు ఆటు ముగిసే సమయానికి 34 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 128 పరుగులు చేసింది.

కివీస్ ఆటగాళ్లలో రాస్ టేలర్ మాత్రమే అత్యధికంగా 36 పరుగులు చేయగా రోంచీ (35), గుప్తిల్ (13), లాంథమ్ 1, నిక్లోస్ 1, సట్నర్ 11 హెన్రీ 0 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం వాట్లింగ్ 12, పటేల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5, షమీ, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.

Kolkata Test, Day 2: India bundled out for 316 in first innings after Saha hits 50

వరుణడు ఆటంకం

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం కలిగించాడు. న్యూజిలాండ్ కీలక వికెట్లను కోల్పోయి ఎదురీదుతున్న సమయంలో భారీ వర్షం పడటంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ప్రస్తుతం వర్షం తగ్గినా.. ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో మ్యాచ్‌ కొనసాగడంపై అంపైర్లు కొద్దిసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు.

మ్యాచ్ నిలిచి పోయే సమయానికి న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 24.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో గప్టిల్(13), లాథమ్(1), నికోలస్(1), ల్యూక్ రోంచీ(35)లు పెవిలియన్ చేరారు. భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా, షమీ, జడేజాలకు చెరో వికెట్ దక్కింది.

కుప్పకూలిన టాప్ ఆర్డర్: 21 ప‌రుగుల‌కే ఇద్ద‌రు ఔట్
తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 316 పరుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాట్‌మెన్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ తట్టుకోలేకపోయారు. న్యూజిలాండ్ ఓపెన‌ర్లు గుప్టిల్‌, లాథ‌మ్ క్రీజులో కాలు పెట్టిన వెంట‌నే వెనుదిగారు. లాథ‌మ్ కేవ‌లం ఒక్క ప‌రుగుకే మ‌హ‌మ్మ‌ద్ స్యామీ బౌలింగ్‌లో ఔట్ కాగా, గుప్తిల్ 13 ప‌రుగులకే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు.

భారత్ 316 ఆలౌట్

ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌట్ అయింది. 239/7 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది.

పుజారా 87, రహానె 77, సాహా 54 (నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో వచ్చిన శిఖర్‌ ధావన్‌(1), మురళీ విజయ్‌(9), కోహ్లి(9), రోహిత్‌ శర్మ(2) విఫలమయ్యారు. కాగా, కివీస్ బౌలర్లలో హెన్నీ 3, బౌల్ట్‌, వాగ్నర్‌, జేఎస్‌ పాటిల్‌ తలో రెండు వికెట్లు తీశారు. శాంట్నర్‌ ఒక వికెట్‌ సాధించాడు.

వికెట్ కీపర్ సాహా ఒంటరి పోరాటం భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరుని అందించాడు. చివరి వికెట్‌కు షమితో కలిసి 35 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బ్యాట్స్ మెన్ సాహా, రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌ను శనివారం కొనసాగించారు.

భారత వికెట్ కీపర్ సాహా అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఒంటరిగా పోరాటం చేస్తూనే జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన సాహా ఆచితూచి ఆడుతున్నాడు. 42 పరుగులు వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే ఒక ఫోర్, ఒక సిక్సుతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ఏడు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+