అన్ని రకాలుగా బాధ పడ్డా: వాషింగ్టన్ సుందర్
RG Kar gang rape: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఈ విషయాన్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సైతం ధృవీకరించారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సీబీఐకి అప్పగించింది. రంగంలో దిగిన సీబీఐ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. దోషులకు మరణశిక్ష విధించాలంటూ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా రోడ్డెక్కారు.
ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లయినా వదలకూడదంటూ పట్టుబట్టారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి. అత్యవసరం మినహా మిగిలిన అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు.
ఈ దారుణ ఉదంతంపై టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ ఘాటుగా స్పందించాడు. దేశంలో అతిపెద్ద సామాజిక మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నాడు. అలాంటి మార్పు మనతోనే మొదలు కావాలని ఆకాంక్షించాడు. మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అభిప్రాయపడ్డాడు.
ఆన్ డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్‌పై చోటు చేసుకున్న అత్యాచార, హత్యకు సంబంధించిన ఫొటోలు తనను కలచి వేశాయని, ఓ అన్నగా, కొడుకుగా, స్నేహితుడిగా.. అన్నింటికీ మించి ఓ మనిషిగా తీవ్ర ఆందోళనకు గురి చేశాయని వ్యాఖ్యానించాడు. తోటి మనిషిగా.. ఈ సమాజంలో మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications