Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనికి శిక్ష పడి తీరాల్సిందే- హర్భజన్ ఫైర్

RG Kar gang rape: కోల్‌కతలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దుమారం రేపుతోంది. రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.

ఈ నెల 9వ తేదీన ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌ సెమినార్ హాలులో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైంది. హత్య చేయడానికి ముందు ఆమె గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Kolkata rape case Girl should get justice says Former cricketer Harbhajan Singh

ఈ విషయాన్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సైతం ధృవీకరించారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సీబీఐకి అప్పగించింది. రంగంలో దిగిన సీబీఐ అధికారులు పలువురిని అరెస్ట్ చేశారు. దోషులకు మరణశిక్ష విధించాలంటూ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా రోడ్డెక్కారు.

ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. దోషులు ఎంతటి వాళ్లయినా వదలకూడదంటూ పట్టుబట్టారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం స్పందించింది. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఔట్ పేషెంట్ విభాగాలు మూతపడ్డాయి. అత్యవసరం మినహా మిగిలిన అన్ని రకాల వైద్య సేవలను డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది బహిష్కరించారు.

ఈ దారుణ ఉదంతంపై టీమిండియా మాజీ ప్లేయర్ టర్బొనేటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. మన ఇంటి ఆడబిడ్డపై జరిగిన అత్యంత అమానవీయకరమైన ఘాతుకంగా అభివర్ణించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం దక్కడానికి మనం అందరం ముందుకు రావాల్సిన అవసరం ఉందని, వీలైనంత త్వరగా న్యాయం చేయాలని చెప్పారు.

పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ, గవర్నర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశంలోని ఇతర నాయకులందరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని హర్భజన్ సింగ్ కోరారు. మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైన చట్టాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి నీచమైన పని చేస్తే, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించేలా ఈ చట్టాలు ఉండాలని చెప్పారు.

Story first published: Sunday, August 18, 2024, 15:45 [IST]
Other articles published on Aug 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+