Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వర్సెస్ గౌతం గంభీర్: నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు

Gautam Gambhir-Mahendra Singh Dhoni
చెన్నై: మరి కొద్ది గంటలలో భారతదేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపిఎల్4 మొదలవ్వబోతోంది. మొట్టమొదట మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో చెన్నై లోని ఎం.ఎ చిదంబరం స్టేడియంలో తలపడనుంది. వరల్డ్ కప్ ముగిసిన అతి కొద్ది రోజలకే ఐపిఎల్4 మొదలవబోతోంది. వరల్డ్ కప్‌లో భారతదేశం మొత్తం ఒకవైపు ఉంటే మిగిలిన దేశాలు మరోవైపు ఉండి ఆటను ఆడతాయి. కానీ ఈ ఐపిఎల్‌లో మాత్రం అలా కాదు.. దేశ విదేశాలలో ఉన్నటువంటి అందరు ప్లేయర్స్ కలసి మెలసి మొత్తం పది జట్లుగా విడిపోయి మరీ ఈ ఐపిఎల్‌లో ఆడడం జరుగుతుంది. ఇక్కడే అసలు కిక్ ఉంటుందంటున్నారు...అభిమానులు

మిగతా జట్లతో పోల్చుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో పెద్ద ఆటగాళ్శ మార్పులు ఏమీ జరగలేదు. ఐతే కోల్‌కత్తా నైట్ రైడర్స్ కూడా ఈసారి అధ్బుతమైన ఆటగాళ్శతో ఐపిఎల్ బరిలోకి దిగుతుంది. 2008, 2009, 2010 మూడు సీజన్స్ లో కూడా కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా గంగూలీ వ్యవహారించిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఐపిఎల్‌లో గంగూలీని ఏ ప్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవడం విశేషం.

ఐపిఎల్3లో ఢిల్లీ డేర్ డేవిల్స్ టీమ్‌కు ఆడినటువంటి గౌతమ్ గంభీర్‌ని కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీమ్ యజమాని షారుఖ్ ఖాన్ $2.4 మిలియన్స్‌కు కోన్న విషయం తెలిసిందే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఐపిఎల్‌లో మంచి టీమ్‌‍గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అందుకు కారణం 2008వ సంవత్సరంలో సెమీ ఫైనల్స్, 2009వ సంవత్సరంలో సెమీ ఫైనల్స్ , 2010ల సంవత్సరంలో ట్రోఫీని కైవసం చేసుకోవడమే.

దీనితోపాటు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ, బ్యాటింగ్ మరియు బౌలింగ్ లైనప్ కూడా ఈటీమ్‌కు కలిసవచ్చే విషయం. ఇక కోల్‌కత్తా నైట్ రైడర్స్ విషయానికి వస్తే గతంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో జరిగినటువంటి మ్యాచ్ లలో పరాజయం పాలవ్వడం. అందుకే కాబోలు ఈసారి కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టులో యూసఫ్ పఠాన్, బ్రెటలీ, జాకబ్ కల్లిస్, బ్రాడ్ హాడన్ లాంటి అత్యుత్తమ బ్యాట్స్ మెన్, బౌలర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మీద కసితీర్చుకోవడానికి సిద్దంగా ఉంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+