Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR Squad 2022: అయ్యర్ కెప్టెన్సీలో తగ్గెదేలే అంటున్న కోల్‌క‌తా! ఈ సారి క‌ప్‌ ప‌క్కా.. పూర్తి జ‌ట్టు ఇదే

Kolkata Knight Riders Squad 2022: Players List With Price and Full Team For IPL 2022

బెంగ‌ళూరు: గ‌తేడాది ఐపీఎల్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌ ఫైన‌ల్ వ‌ర‌కు చేరుకుంది. కానీ ఫైన‌ల్‌లో మాత్రం ఓట‌మి పాలైంది. ఫైన‌ల్‌లో కోల్‌క‌తాను ఓడించి చెన్నైసూప‌ర్ కింగ్స్ క‌ప్ ఎగురేసుకుపోయింది. ఓపెన‌ర్లు అద‌ర‌గొట్టిన మిడిలార్డ‌ర్ వైఫ‌ల్యం కార‌ణంగా ఆ మ్యాచ్‌లో కోల్‌క‌తా ఓటమి పాలై మూడో సారి ట్రోఫీ గెలిచే అవ‌కాశాన్ని కోల్పోయింది. అయితే ఈ సారి మాత్రం ఆ త‌ప్పును పున‌రావృతం చేయ‌కుండా ట్రోఫీ గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే కోల్‌క‌తా యాజ‌మాన్యం మెగా వేలంలో త‌మ జ‌ట్టును కొనుగోలు చేసింది.

రిటెన్ష‌న్ జాబితా

రిటెన్ష‌న్ జాబితా

ఐపీఎల్ మెగా వేలానికి ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ న‌లుగురు ఆట‌గాళ్ల‌ను రిటైన్ చేసుకుంది. ఆ జట్టు రిటైన్ చేసుకున్న వారిలో ఆండ్రీ ర‌సూల్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, వెంక‌టేశ్ అయ్య‌ర్, సునీల్ న‌రైన్ ఉన్నారు. వీరికి నలుగురికి 34 కోట్ల రూపాయ‌లు వెచ్చించి 56 కోట్లతో మెగా వేలానికి వెళ్లింది.

ఎన్ని డ‌బ్బులు మిగిలాయి

ఎన్ని డ‌బ్బులు మిగిలాయి

మెగా వేలంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 21 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. అంత‌కు ముందు రిటైన్ చేసుకున్న నలుగురు ఆట‌గాళ్ల‌ను క‌లుపుకుంటే జ‌ట్టులోని స‌భ్యుల సంఖ్య 25 మందికి చేరింది. ఇందులో 8 మంది ఆట‌గాళ్లు విదేశీయులు ఉన్నారు. ఇక మొత్తం వేలం ముగిశాక కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ వ‌ద్ద ఇంకా 45 ల‌క్ష‌ల రూపాయ‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి.

అత్య‌ధికంగా ఎవ‌రికంటే

అత్య‌ధికంగా ఎవ‌రికంటే

మెగా వేలంలో ఆ జ‌ట్టు శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ఎక్కువ డ‌బ్బులు వెచ్చించింది. అత‌ని 12 కోట్ల 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. ఇక‌ నితీశ్‌ రాణాను రూ. 8 కోట్లకు, శివమ్‌ మావిని రూ. 7.25 కోట్లకు, ప్యాట్‌ కమిన్స్‌ను రూ. 7.25 కోట్లకు ద‌క్కించుకుంది. మిగ‌తా వారిని త‌క్కువ ధ‌ర‌లోనే ద‌క్కించుకుంది. కాగా ఆ జ‌ట్టుకు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను కెప్టెన్‌గా నియ‌మించే అవ‌కాశాలే చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌లో జ‌ట్టు బ‌లంగా కనిపిస్తుంది.

బ్యాట‌ర్లు, బౌల‌ర్లు వీళ్లే

బ్యాట‌ర్లు, బౌల‌ర్లు వీళ్లే

కోల్‌క‌తాలో బ్యాట‌ర్లుగా శ్రేయాస్ అయ్య‌ర్‌, షెల్డన్‌ జాక్సన్‌, అజింక్యా రహానె, రింకుసింగ్‌, బాబా ఇంద్రజీత్‌, అభిజీత్‌ తోమర్‌, శామ్‌ బిల్లింగ్స్‌, అలెక్స్ హేల్స్ ఉన్నారు. ఇక బౌల‌ర్లుగా సిక్‌దార్‌, అశోక్‌శర్మ, సౌథీ, ప్యాట్‌ కమిన్స్‌, వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌యాదవ్ ఉన్నారు. ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో ఆండ్రూ రస్సెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, సునీల్ నరైన్‌, నితీశ్ రానా, శివం మావి, అనుకూల్‌రాయ్‌, చమిక కరుణరత్నే, ప్రథమ్‌ సింగ్‌, రమేశ్‌ కుమార్‌, నబి, అమన్‌ హకీమ్‌ ఖాన్ ఉన్నారు.

కేకేఆర్ పూర్తి జ‌ట్టు ఇదే

కేకేఆర్ పూర్తి జ‌ట్టు ఇదే

శ్రేయస్‌ అయ్యర్(12.25 కోట్లు), ఆండ్రీ రసెల్‌ (12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (8 కోట్లు),

వెంకటేశ్‌ అయ్యర్‌ (8 కోట్లు) నితీశ్‌ రాణా ( 8 కోట్లు), శివమ్‌ మావి(7.25 కోట్లు), ప్యాట్‌ కమిన్స్‌(7.25 కోట్లు), ఉమేశ్‌ యాదవ్(2 కోట్లు), సామ్‌ బిల్లింగ్స్‌(2 కోట్లు), అలెక్స్‌ హేల్స్‌(1.50 కోట్లు), టిమ్‌ సౌథీ(1.50 కోట్లు), అజింక్య రహానె(కోటి), నబీ(కోటి), షెల్డన్‌ జాక్‌సన్‌(60 లక్షలు), రింకు సింగ్(55 లక్షలు), అశోక్‌ శర్మ( 55 లక్షలు), చమిక కరుణరత్నె(50 లక్షలు), అభిజిత్‌ తోమర్(40 లక్షలు), అమన్‌ఖాన్‌, అనుకుల్ రాయ్, ప్రతామ్‌ సింగ్, రసిఖ్ దార్‌, బాబా ఇంద్రజిత్(వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Monday, February 14, 2022, 19:12 [IST]
Other articles published on Feb 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+