Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ ఏం చెప్తోంది: ఐపీఎల్ 2020లో ఆడేందుకు ప్రవీణ్ తాంబే అనర్హుడు!

Kolkata Knight Riders spinner Pravin Tambe not eligible to play in IPL as per BCCI rules

హైదరాబాద్: వెటరన్ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 ఎడిషన్‌లో పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్టే కనబడుతోంది. ఐపీఎల్ 2020 సీజన్‌ను మార్చి 29 నుంచి ప్రారంభించేందుకు నిర్వాహాకులు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

గత నవంబరులో అబుదాబి టీ10 లీగ్‌లో ప్రవీణ్‌ తాంబే ఆడిన కారణంగా అతడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. టీ10 లీగ్‌లో ప్రవీణ్‌ తాంబే నార్తర్న్‌ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో ప్రవీణ్ తాంబే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడటంపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్‌లో ఆడాలనుకునే భారత క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా బయట జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనకూడదు. అయితే, టీ10 డ్రాఫ్ట్ కోసం అతడి పేరుని పంపడం... ఇప్పుడు ఐపీఎల్‌లో భాగం కావడం బీసీసీఐ ప్రోటోకాల్‌కు విరద్దుగా ఉంది. కాబట్టి ప్రవీణ్ తాంబే వచ్చే ఐపీఎల్‌లో ఆడలేడని తెలిపారు.

ఐపీఎల్ 2020 సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్‌కతా వేదికగా ఆటగాళ్ల వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) పాల్గొనగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రాంచైజీ అతడి ప్రాథమిక ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌ వేలంలో అమ్ముడైన అతి పెద్దవయస్సు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

48 ఏళ్ల తాంబే క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో ఇంకా ఆడుతున్నట్లు తెలిపాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2013 సీజన్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసాడు. 2016లో ఆడకపోయినప్పటికీ.. 2017 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అయితే, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.

Story first published: Monday, January 13, 2020, 15:48 [IST]
Other articles published on Jan 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+