150 కిలోమీటర్ల వేగంతో కరోనా దూసుకొస్తోంది.. చేతులను తరచూ శుభ్రపరుచుకుంటూ ఔట్‌ చేద్దాం!!

హైదరాబాద్: భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు క్రమం తప్పకుండా 3.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల్లో 4 లక్షల మార్కును అధిగమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత రెండు రోజుల్లో కొత్త కేసుల సంఖ్య పడిపోయినప్పటికీ.. మరణాల రేటు మాత్రం అధికంగా ఉంది. సరైన వైద్యం అందక చాలామంది మరణిస్తున్నారు. అయితే దేశం కరోనాపై చేస్తున్న యుద్ధంలో తమ వంతు సహకారం అందించేందుకు సెలబ్రెటీలు, క్రికెటర్లు విరాళాలు ప్రకటిస్తున్నారు.

టీనేజ్‌ సెన్సేషన్‌ షఫాలీ వర్మకు మరో బంపర్ ఆఫర్!!

 ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి:

ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి:

దేశ ప్రజల కోసం ఆక్సిజన్‌ ఉత్పత్తి పరికరాలను ఆస్పత్రులకు అందిస్తున్నారు మరికొంతమంది. అంతేకాకుండా కరోనా సోకకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, తరచూ చేతులను శుభ్రపరుచుకోవడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ఇంకొంతమంది ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ.. వాటిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) గత కొన్ని రోజులుగా ట్విటర్‌ వేదికగా వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది.

 కరోనాను ఔట్‌ చేద్దాం:

కరోనాను ఔట్‌ చేద్దాం:

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేస్తూ కేకేఆర్‌ పలు చిత్రాలను పోస్ట్ చేసింది. 'మంచి ఆటగాళ్లు షాట్ ఆడే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు', 'కరోనా నీ దగ్గరకు గంటకు 150 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకొస్తోంది. జాగ్రత్తగా ఉండు', 'చేతులను తరచూ శుభ్రపరుచుకుంటూ కరోనాను ఔట్‌ చేద్దాం', 'గల్లీలో క్యాచ్ కోసం ఎంత అలర్ట్ అయి ఉంటామో.. డబుల్ మాస్క్ పెట్టుకుని కరోనాతో అంతే జాగ్రత్తగా ఉండాలి' అంటూ క్రికెట్‌కు పరిభాషలో కరోనాపై అవగాహన కల్పిస్తోంది. ఫోటోలలో కేకేఆర్‌ ఆటగాలు ఉన్నారు. ఆటగాళ్ల చిత్రాలకు కాప్షన్ పెట్టి కేకేఆర్‌ ట్వీట్‌ చేస్తోంది. ఆ ట్వీట్‌లను మీరూ చూసేయండి.

వైరస్ బారిన పడిన వరుణ్‌, సందీప్:

వైరస్ బారిన పడిన వరుణ్‌, సందీప్:

సజావుగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను ఒకే ఒక వారం అక్కడి పరిస్థితులను తారుమారు చేసింది. కరోనా కేసులు పెరగడంతో మార్చి 4న అనూహ్య ప‌రిస్థితుల్లో ఐపీఎల్ 2021ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. మొదటగా కోల్‌కతా బౌలర్లు వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌కు పాజిటీవ్ రాగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, హైదరాబాద్ సీనియర్ కీపర్ వృద్దిమాన్ సాహా, చెన్నై కోచ్‌లు లక్ష్మీపతి బాలాజీ, మైఖేల్ హస్సిలు మహమ్మారి బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది.

పట్టికలో 7వ స్థానం:

పట్టికలో 7వ స్థానం:

ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్‌లకు గాను.. లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. టోర్నీలో ఏడు మ్యాచులు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండు విజయాలను మాత్రమే అందుకుంది. నాలుగు పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గతేది లాగే ఈసారి కూడా కేకేఆర్‌ నిరాశపరిచింది. గెలిచే మ్యాచులను కూడా చేజేతులారా పోగొట్టుకుంది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ మార్క్ ఎక్కడా కనిపించడం లేదు. త్రిపాఠి, కార్తీక్, రసెల్, కమిన్స్ కాస్త పర్వాలేదనిపించినా.. గిల్, రాణా, మోర్గాన్, ప్రసిద్ పూర్తిగా విఫలమయ్యారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 14, 2021, 9:41 [IST]
Other articles published on May 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X