For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 విజయాలను సాధించిన మూడో జట్టుగా: ముంబై, చెన్నై సరసన కేకేఆర్

Kolkata Knight Riders complete milestone 100 T20 wins after comprehensive victory over Mumbai Indians

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించడంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే, ఈ విజయంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓ అరుదైన ఘనత సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 100 విజయాలను సాధించిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ముంబై, చెన్నై సరసన కోల్‌కతా

ముంబై, చెన్నై సరసన కోల్‌కతా

ఈ క్రమంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల సరసన కోల్‌కతా కూడా చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ నెగ్గి కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆండ్రీ రస్సెల్ 40 బంతుల్లో 80(6 ఫోర్లు, 8 సిక్సులు) పాటు శుభ్‌మన్‌ గిల్‌ 45 బంతుల్లో 76(6 పోర్లు, 4 సిక్సులు), క్రిస్‌ లిన్‌ 29 బంతుల్లో 54 (8 ఫోర్లు, 2 సిక్సులు) రెచ్చిపోవడంతో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.

ముంబైని ఓటమి నుంచి తప్పించలేకపోయిన హార్ధిక్

ముంబైని ఓటమి నుంచి తప్పించలేకపోయిన హార్ధిక్

అనంతరం లక్ష్య చేధనలో హార్దిక్‌ పాండ్యా 34 బంతుల్లో 91(6 ఫోర్లు, 9 సిక్సులు) అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినా ముంబైని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. 233 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. దీంతో 34 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది.

 50 సిక్సులు బాదిన ఆండ్రీ రస్సెల్

50 సిక్సులు బాదిన ఆండ్రీ రస్సెల్

అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన ఆండ్రీ రస్సెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన రస్సెల్ 207.89 స్ట్రయిక్ రేట్‌ని కలిగి ఉన్నాడు. దీంతో పాటు ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 50 సిక్సులు బాదాడు. ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ 8 సిక్సులు బాదాడు.

టీ20ల్లో 100 లేదా అంతకుమించి విజయాలను సాధించిన జట్లు

టీ20ల్లో 100 లేదా అంతకుమించి విజయాలను సాధించిన జట్లు

ముంబై ఇండియన్స్

చెన్నై సూపర్ కింగ్స్

లాంక్ షైర్

నాటింగ్‌హామ్ షైర్

వార్విక్ షైర్

కోల్‌కతా నైట్‌రైడర్స్

Story first published: Monday, April 29, 2019, 18:49 [IST]
Other articles published on Apr 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+