For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెన్నిస్ ఆడినట్లుగా సిక్సు కొట్టేశాడు(వీడియో)

Kolkata Knight Riders Andre Russell Discovers Tennis Shot To Hit A Six

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో షార్ట్ ఫార్మాట్ క్రికెట్ టీ20. ఈ ఫార్మాట్‌లో అద్భుతమైన షాట్‌లు, స్టన్నింగ్ క్యాచ్‌లు సర్వ సాధారణం. అలాంటిది ఐపీఎల్‌లో.. అయితే ఇక ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ 11వ సీజన్‌లో క్రికెటర్లు రెచ్చిపోయి ఆడారు. ఈ దశలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్, కోల్‌కతాలు తలపడ్డాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై కోల్ కతా 25పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్ ఆడుతోన్న సమయంలో ఆండ్రీ రస్సెల్ కొట్టిన షాట్ కొత్తగా అనిపించింది. బ్యాట్ ఝళిపించిన తీరును టెన్నిస్ ఆడుతున్నట్టుగా ఉందంటూ స్టేడియంలో కోల్‌కతా అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ఆ బాదుడికి బాల్ సిక్సు బౌండరీకి తరలిపోతుంటే బౌలర్ జోఫ్రా ఆర్ఛర్ గాలిలోకి చూస్తూ ఉండిపోయాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న ఆండ్రీ రస్సెల్ షాట్లను ఐపీఎల్ అధికారిక వైబ్ సైట్లో పొందుపరిచింది.

దినేశ్ కార్తీక్ 52 పరుగులు అతనితో పాటు మరో ఎండ్‌లో ఆండ్రీ రస్సెల్ పరుగుల వర్షం కురిపించి కోల్‌కతా స్కోరును పరుగులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచిన కోల్‌కతా క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. ఇప్పటికే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై, హైదరాబాద్‌లు తలపడి చెన్నై గెలిచింది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన హైదరాబాద్‌తో కోల్‌కతా తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ విజేత ముంబైలోని వాంఖడే వేదికగా చెన్నైతో తలపడాల్సి ఉంది.

రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో కోల్‌కతా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమయ్యారు. దాంతో కోల్‌కతా 25 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది. శుక‍్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది.

Story first published: Thursday, May 24, 2018, 13:42 [IST]
Other articles published on May 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+