ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆసక్తికరంగా సాగుతోంది. హ్యాట్రిక్ ఓటములతో ఈ సీజన్ పేలవంగా ప్రారంభించింన ముంబై ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి తమ ఖాతాలో రెండో విజయాన్ని వేసుకుంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఛేదించింది.
అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు విరాట్ కోహ్లి సపోర్ట్‌గా నిలవడంపై మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై సారథి బాధ్యతలు అందుకున్న తర్వాత హార్దిక్ ప్రేక్షకుల నుంచి ఎగతాళికి గురవుతున్న విషయం తెలిసిందే. హార్దిక్ టాస్, బ్యాటింగ్, బౌలింగ్‌కు వచ్చిన సందర్భాల్లో రోహిత్ నినాదాలతో హేళన చేస్తున్నారు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. అయితే మైదానంలో ఈ విషయంపై కోహ్లి రియాక్ట్ అయ్యాడు. హార్దిక్‌ను హేళను చేయొద్దని స్టేడియంలోని ప్రేక్షకులకు సూచించాడు. మద్దతు ఇవ్వాలని కోరాడు. ఆ తర్వాత హార్దిక్ హార్దిక్ అంటూ వీక్షకులు నినాదాలు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దీనిపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. హార్దిక్‌కు కోహ్లి అండగా నిలవడాన్ని మెచ్చుకున్నాడు. ''హార్దిక్ పాండ్యకు కోహ్లి సపోర్ట్ చేసిన విధానం, హేళన చేయొద్దని ప్రేక్షకులకు చెప్పడం, హార్దిక్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన విధానం.. కోహ్లి గొప్ప ప్లేయర్, గొప్ప క్రీడాస్ఫూర్తి ఆటగాడు అని చెప్పడానికి సంకేతం'' అని హర్భజన్ పేర్కొన్నాడు.
ఛేదనలో హార్దిక్ పాండ్య ఆరు బంతుల్లో అజేయంగా 21 పరుగులు చేశాడు. క్రీజులోకి వచ్చి ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అంతేగాక సిక్సర్‌తోనే ముంబై ఇండియన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. హార్దిక్‌తో పాటు ఇషాన్ కిషన్ (68; 34 బంతుల్లో, 7x4, 5x6), సూర్యకుమార్ యాదవ్ (52; 19 బంతుల్లో, 5x4, 4x6) దూకుడుగా ఆడారు.