Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీలో మూడు పిచ్‌లు: ఆసీస్ పత్రిక కథనంపై క్యూరేటర్

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 16 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు ఫలాన పిచ్ కావాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అడిగాడంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని జేఎస్‌సీఏ క్యూరేటర్ ఎస్బీ సింగ్ స్పష్టం చేశారు.

మూడో టెస్టు కోసం జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్‌సీఏ) మూడు మ్యాచ్‌లను సిద్ధం చేసిందని, అందులో కోహ్లీ టీమ్‌కు ఏది అనకూలంగా ఉంటే ఆ పిచ్‌నే మ్యాచ్‌లో వినియోగిస్తారంటూ ఆస్ట్రేలియన్ దినపత్రిక ప్రచురించిన వార్తల్లో నిజం లేదని పిచ్ క్యూరేటర్ ఎస్బీ సింగ్ తెలిపారు.

పిచ్ రూపకల్పనలో కోహ్లీ పాత్ర లేదు

పిచ్ రూపకల్పనలో కోహ్లీ పాత్ర లేదు

మూడో టెస్టు జరిగే జేఎస్‌సీఏ స్టేడియంలో పిచ్ రూపకల్పనపై కెప్టెన్ విరాట్ కోహ్లీ పాత్ర లేదని జేఎస్‌సీఏ జాయింట్ సెక్రటరీ దేబాశిస్ చక్రబొర్తి సైతం తిప్పికొట్టారు. 'ఎస్బీ సింగ్ చెప్పింది నిజం. స్టేడియంలో మొత్తం తొమ్మిది పిచ్‌లు ఉండగా, అందులో టెస్టు మ్యాచ్ నిర్వహణకు మూడు పిచ్‌లను తయారు చేసిన మాట వాస్తవం' అని ఆయన తెలిపారు.

మూడు పిచ్‌లు ఈ సీజన్‌లో ఉపయోగించినవే

మూడు పిచ్‌లు ఈ సీజన్‌లో ఉపయోగించినవే

'మ్యాచ్ నిర్వహణ అధికారులు వచ్చి ఫలాన పిచ్‌ను సిద్ధం చేయమని చెప్పిన తరువాత మాత్రమే ఆ రకంగా ముందుకు వెళతాం. మేము రూపొందించిన మూడు పిచ్‌లను కూడా ఈ సీజన్‌లో ఉపయోగించినవే. ఆ విషయాన్నే చెప్పాం. అంతేకానీ పిచ్ రూపకల్పనలో విరాట్ పాత్ర ఉన్న విషయాన్ని క్యూరేటర్ ఎక్కడా చెప్పలేదు' అని అన్నారు.

కోహ్లీ కూడా క్యూరేటర్లకు ఏమీ చెప్పలేదు

కోహ్లీ కూడా క్యూరేటర్లకు ఏమీ చెప్పలేదు

'ఆ పిచ్ తయారీపై కోహ్లీ కూడా క్యూరేటర్లకు ఏమీ చెప్పలేదే. అలాంటప్పుడు ఆ కథనాల్ని ఎలా ప్రచురిస్తారు. ఇక్కడ 4,5,7 నంబర్లు గల పిచ్‌లను తయారు చేసి ఉంచాం. భారత జట్టుకు అనుకూలంగా పిచ్‌ను తయారు చేయమన్నారని కోహ్లీ చెప్పినట్లు వచ్చిన వార్తలు నిజం కాదు' అని దేబాశిస్ చక్రబొర్తి తెలిపారు.

ఐదు రోజుల పాటు జరగాలని కోరుకుంటున్నాం

ఐదు రోజుల పాటు జరగాలని కోరుకుంటున్నాం

తొలిసారి టెస్టు మ్యాచ్‌కు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యమిస్తోందని ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పిచ్ స్లోగా ఉందా లేదా టర్న్ అవుతుందా అనే విషయం ఆడితేనే తెలుస్తుందని చక్రబొర్తి పేర్కొన్నాడు.

మార్చి 16 నుంచి మూడో టెస్టు ప్రారంభం

మార్చి 16 నుంచి మూడో టెస్టు ప్రారంభం

నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో ఇరు జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్‌ని గెలిచాయి. దీంతో సిరిస్ 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో మార్చి 16 నుంచి రాంచీలో ప్రారంభం కానున్న మూడో టెస్టు ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+