Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్300 - స్పెషల్ మ్యాచ్ కోసం ప్రత్యేక అతిథి!.. ఎవరొచ్చారో తెలుసా?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ప్రత్యేక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. వన్డే కెరీర్ లో 300వ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌ - భారత్ ఆడనున్న చివరి లీగ్ మ్యాచే.. కోహ్లీకి 300వ మ్యాచ్ కావడం విశేషం. దీంతో విరాట్ మైల్‌స్టోన్ మ్యాచ్ వీక్షించేందుకు భారీ స్థాయిలో అభిమానులకు స్టేడియానికి వస్తున్నారు.

ఈ క్రమంలోనే కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పాటు విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ కూడా స్టేడియానికి వస్తున్నారు. వీరిద్దరు కోహ్లీ ప్రత్యేక వన్డే మ్యాచ్ ను చూసేందుకు దుబాయ్ కు వచ్చారు. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. "అనుష్క శర్మ, వికాట్ కోహ్లీ సోదరుడు ఆదివారం దుబాయ్ కు చేరుకుంటారు. విరాట్ కోహ్లీ 300వ మ్యాచ్ చూసేందుకు వాళ్లు వస్తున్నారు" అని ఓ ప్రతినిధి తెలిపారు.

Kohli wife anushka and brother vikas reach Dubai for kohli 300 ODI ind vs nz champions trophy 2025

బీసీసీఐ కండిషన్స్..
భారత జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు.. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లినా అక్కడ వారు కేవలం రెండు వారాలు (45 రోజుల పర్యటన) మాత్రమే ఉండేందుకు పర్మిషన్ ఇచ్చింది బీసీసీఐ. అదే నెల రోజుల పర్యటన అయితే వారం రోజులు ఉండేలా వెసులుబాటు కల్పించింది.

కోహ్లీ గణాంకాలు..
కోహ్లీ ఇప్పటివరకు 299 వన్డేలు ఆడి 14,085 పరుగులు చేశాడు. 58.20 సగటు, 93.41 స్ట్రైక్ రేట్ తో ఈ రన్స్ చేశాడు. ఇందులో 51 శతకాలు, 73 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 193. అలానే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేలు, 9 వేలు,10 వేలు,11 వేలు,12 వేలు,13 వేలు,14 వేల పరుగులు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.

Story first published: Sunday, March 2, 2025, 12:55 [IST]
Other articles published on Mar 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+