
ఆస్ట్రేలియాతో జరుతున్న రెండో టెస్టులో కూడా భారత బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఆసీస్ బ్యాటర్లకు తొలి షాక్ ఇచ్చింది మాత్రం మహమ్మద్ షమీనే. అయితే అతను వేసిన ఒక డెలివరీనే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మూడో ఓవర్లో బంతి అందుకున్న అతను తొలి బంతిని కొత్తగా వేద్దామని అనుకున్నాడేమో? ఆ సమయంలో బంతి అతని చెయ్యి దారింది. అలా వెళ్లి బ్యాటర్‌ను కూడా దాటి వెళ్లి, అక్కడ పిచ్ పడి కీపర్ దగ్గరకు వెళ్లింది. అప్పుడు స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా కూడా ఈ డెలివరీని చూసి ఆశ్చర్యపోయారు.
దీన్ని చూసిన వాళ్లందరూ ఈ బంతి వైడ్ అని అనుకున్నారు. కానీ అంపైర్ మాత్రం బంతిని చెక్ చేసి దాన్ని నోబాల్‌గా ప్రకటించాడు. అలా ఎందుకు చెప్పాడో చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకంటే ఈ బంతి పిచ్ పడింది కూడా పిచ్‌పై కాదు. అందుకే దీన్ని నోబాల్‌గా ప్రకటించారు. క్రికెట్ నిబంధనల్లోని ఆర్టికల్ 21.12 ప్రకారం, బ్యాటర్‌ను దాటిన తర్వాత బంతిలో కొంత భాగమైనా, లేక పూర్తిగా అయినా సరే పిచ్ ఆవల పిచ్ పడితే అది ఇల్లీగల్ డెలివరీ అని రాసి ఉంది. షమీ వేసిన డెలివరీ అలాగే పిచ్ పడింది. దీంతో దాన్ని నోబాల్‌గా ప్రకటించారు.
కాగా, ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చక్కగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే మిగతా ఆటగాళ్లు మాత్రం పెద్దగా రాణించలేదు. అదే సమయంలో అశ్విన్ మరోసారి బంతితో మాయ చేశాడు. కీలకమైన మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ ఇద్దరినీ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ జట్టు 168 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.