For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌నే ముందుకు మార్చండి: కోహ్లీ

Kohli Wants Bhuvneshwar, Bumrah to Skip IPL But Franchises Unlikely to Support Proposal

ముంబై: భారత క్రికెట్‌ జట్టు తీరిక లేని షెడ్యూలు ఇప్పుడు బీసీసీఐని ఇరకాటంలో నెట్టింది. అగ్రశ్రేణి క్రికెటర్లంతా ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండు నెలల పాటు జరిగే ఐపీఎల్‌ మే 19న ముగుస్తుంది. ఆ వెంటనే ఇంగ్లాండ్‌లో 30న ఆరంభమయ్యే ప్రపంచకప్‌ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సివుంటుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ కొత్త ప్రతిపాదనను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ముందు ఉంచాడు.

ఫ్రాంచైజీలు అంగీకరించే పరిస్థితి లేదు

ఫ్రాంచైజీలు అంగీకరించే పరిస్థితి లేదు

వరల్డ్‌కప్‌లో ఆడబోయే పేస్ బౌలర్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని అతడు వాదిస్తున్నాడు. అయితే అతని ప్రతిపాదనను ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విశ్రాంతి వల్ల వాళ్లు ప్రపంచకప్‌కు తాజాగా, ఫిట్‌గా ఉంటారన్నది అతడి ఉద్దేశం. వినోద్‌ రాయ్‌ నేతృత్వంలోని పరిపాలకుల కమిటీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మధ్య జరిగిన సమావేశంలో కోహ్లి ఈ ప్రతిపాదన చేశాడు.

మార్చి 29న ఆరంభమై మే 19న ముగియనుండగా:

మార్చి 29న ఆరంభమై మే 19న ముగియనుండగా:

ఈ మధ్య హైదరాబాద్‌లో సీఓఏతో జరిగిన మీటింగ్‌లో కోహ్లి ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. ముఖ్యంగా బుమ్రా, భువనేశ్వర్‌లాంటి పేస్ బౌలర్లను ఐపీఎల్ మొత్తానికి దూరంగా ఉంచాలని అతను కోరాడు. ఐతే సమావేశంలో కోహ్లీకి పెద్దగా మద్దతు లభించలేదు. ఫ్రాంఛైజీలు ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం లేదని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు. ‘ఐపీఎల్‌ మార్చి 29న ఆరంభమై మే 19న ముగుస్తుంది. అప్పటికి, ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌కు మధ్య 15 రోజుల విరామం ఉంది. కాబట్టి ఐపీఎల్‌ మొత్తానికి పేసర్లకు విశ్రాంతినిచ్చే అవకాశం లేదు' అని అన్నాడు.

 ఐపీఎల్‌ను ఒక వారం ముందుగానే

ఐపీఎల్‌ను ఒక వారం ముందుగానే

పేసర్లకు విశ్రాంతినిచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ను అనుకున్న షెడ్యూల్‌ కంటే ముందుగానే ప్రారంభించాలని కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రి సీఓఏ సమావేశంలో కోరినట్లు తెలిసింది. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఒక వారం ముందుగానే.. అంటే మార్చి 23నుంచే మొదలుపెడితే పేస్‌ బౌలర్లకు మరికొన్ని రోజులైన విశ్రాంతి దొరికే అవకాశం ఉందని కోహ్లీ పేర్కొన్నట్లు తెలిసింది. ఒకవేళ పరిపాలకుల కమిటీ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే ఒక వారం ముందుగానే ఐపీఎల్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 వరల్డ్‌కప్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్

వరల్డ్‌కప్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్

విశ్రాంతి ప్రతికూలంగా కూడా పరిణమించవచ్చని మరో అధికారి వ్యాఖ్యానించాడు. సీఓఏతో జరిగిన సమావేశంలో విరాట్‌, రోహిత్‌లతో పాటు రహానె, కోచ్‌ రవిశాస్త్రి, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా పాల్గొన్నారు. ఇక ఆ ఇద్దరు ప్రధాన బౌలర్లను ఐపీఎల్ మొత్తానికి దూరం చేస్తే వాళ్లకు వరల్డ్‌కప్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు కదా అనే వాదన కూడా ఆ సమావేశంలో చర్చకు వచ్చినట్లు ఆ అధికారి వెల్లడించారు.

Story first published: Friday, November 9, 2018, 13:12 [IST]
Other articles published on Nov 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+