Kohli vs Dhoni: ధోనీ ఔటయ్యాక కోహ్లీ వల్గర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్

పూణెలోని ఎంసీఏ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 13పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ 33 బంతుల్లో 30పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. కోహ్లీ ఫామ్ లేమితో కొన్ని రోజులుగా సతమతమవుతూనే ఉన్నాడు. కోహ్లీ పేలవమైన బ్యాటింగ్ అభిమానులను కలిచివేస్తున్న సంగతి పక్కన పెడితే అంతకుమించి నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ ప్రవర్తన కూడా అభిమానులను డిస్సాపాయింట్ చేసింది. ఛేదనలో భాగంగా చెన్నై కెప్టెన్ ధోని ఔట్ అయ్యాక.. కోహ్లీ అబ్యూజింగ్ లాంగ్వేజీతో ఓవర్ సెలెబ్రేషన్స్ ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచింది. ఎంఎస్ ధోనీ లాంటి లెజెండ్ ఔటయ్యాక వ్యవహరించాల్సిన పద్ధతి ఇది కాదని అభిమానులు నెట్టింటా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కోహ్లీ ప్రవర్తన ఏం బాలేదంటూ అభిమానులు మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే?
ఇక చెన్నై 174పరుగుల టార్గెట్ ఛేదిస్తున్న క్రమంలో 19ఓవర్ వేసిన జోష్ హేజిల్‌వుడ్ ఓవర్‌లో ధోనీ మిడ్-వికెట్ దిశగా సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ షాట్ సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో బంతి నేరుగా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ చేతిలోకి వెళ్లింది. దీంతో ధోనీ ఔటయ్యాడు. కీలక దశలో ధోనీ ఔటవ్వడంతో మ్యాచ్ చెన్నై నుంచి చేజారి ఆర్సీబీ చేతిలోకి వెళ్లింది. ఇక ఈ ఔట్ సందర్భంగా.. విరాట్ కోహ్లీ గట్టిగట్టిగా అరుస్తూ.. అబ్యూజివ్ లాంగ్వేజీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. అది కాస్త వైరలైంది.
విరాట్ ఓ పాములాంటోడు
ఓ నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. చూశారుగా విరాట్ ఓ పాములాంటోడు. ధోనీ లాంటి ప్లేయర్ ఔటయితే ఇంత వల్గర్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. విరాట్ స్థాయి, నిజస్వరూపం ఇది. ధోనీ అంటే లోలోపల కుళ్లుకునే వ్యక్తి విరాట్ అని పేర్కొన్నాడు. భారత ఆర్మీకి చెందిన ఓ ప్లేయర్‌ను కోహ్లీ దుర్భాషలాడాడు. నిజం చెప్పాలంటే కోహ్లీ ఓ యాంటీ నేషనల్ పర్సన్ అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీకి ధోనీకి డిఫెరెన్స్ అదే
మరో నెటిజన్ ఈ వీడియోను ఉదాహరణగా పేర్కొంటూ మహేంద్ర సింగ్ ధోనీకి, విరాట్ కోహ్లీకి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్పాడు. కోహ్లీ అవుట్ అయినప్పుడు ధోనీ రియాక్షన్ సాధారణంగానే ఉంటుంది. కానీ ధోనీ అవుట్ అయితే మాత్రం కోహ్లీ ఎక్కడ లేని సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఓ విరాట్ కోహ్లీ అభిమానిగా చెబుతున్నాను.. ఇలాంటి ప్రవర్తను కోహ్లీ నుంచి నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు. వికెట్ పడ్డ తర్వాత ఇంత అబ్యూజివ్ లాంగ్వేజీ ఉపయోగిస్తూ.. సెలబ్రేషన్స్ జరుపుకోకుండా ఉండాల్సింది. క్రికెట్లో ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైంది అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications