
హైదరాబాద్: పిచ్ అనుకూలంగా లేకపోయినా బౌలర్లు తీవ్రంగా కష్టపడి మరీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశారు. పర్యటనలో తొలి టెస్టులో కూడా బౌలర్లు చూపించినంత ప్రతిభను బ్యాట్స్‌మెన్స్ చూపించలేకపోతున్నారు. కానీ, జట్టు సారథి మాత్రం రెండో టెస్టులో మాత్రం పరుగుల వరద పారించాడు. అజేయంగా 153 స్కోరును సాధించాడు.
బౌలింగ్‌తో దడ పుట్టించిన సఫారీలు:
సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్‌తో బౌలింగ్ ఆరంభించి ఆశ్చర్యపరచగా అగ్ర పేసర్ మోర్నె మోర్కెల్, షార్ట్‌పిచ్ బంతులు.. పదునైన బౌన్సర్లతో ఓపెనర్లకు సవాల్ విసిరాడు. ఈక్రమంలో ఇన్నింగ్స్ పదో ఓవర్లో మోర్కెల్‌కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి రాహుల్ అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే భారత్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు అరంగేట్రం బౌలర్ ఎన్‌గిడి. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా.. మోర్కెల్ బంతిని మిడాన్ వైపు ఆడి గుడ్డిగా పరుగు తీయగా.. అతణ్ణి వారించే ప్రయత్నం చేయని విజయ్ వెళ్లాలా వద్దా అనుకొని పరుగందుకున్నాడు.
బ్యాటింగ్‌కు దిగిన భారత ఆటగాళ్లు;
వచ్చీరాగానే మోర్కెల్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ అదే జోరును కొనసాగించాడు. రబాడతో పాటు స్పిన్నర్ కేశవ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. కాసేపటికే విజయ్ కూడా బౌండ్రీలు కొట్టడంతో 16వ ఓవర్లో జట్టుస్కోరు 50 పరుగులు దాటింది. ఇద్దరూ 101 బంతుల్లోనే 50 రన్స్ జోడించారు. ఇక, 80/2తో టీ విరామానికి వెళ్లొచ్చిన తర్వాత కోహ్లీ, విజయ్ అదే ధాటిని కొనసాగించారు. ఈ క్రమంలో విరాట్ 68 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయ్ కూడా ఆ మార్కుకు చేరువకావడంతో రెండోరోజు భారత్ పైచేయి సాధించేలా కనిపించింది.
కానీ, తర్వాతి ఓవర్లోనే విజయ్‌ను కేశవ్ అవుట్ చేసి ఆ జోడీని విడదీశాడు. ఇక, కీలక దశలో క్రీజులోకొచ్చిన రోహిత్ మరోసారి విఫలమయ్యాడు. 2ఫోర్లు కొట్టి కుదురుకున్నట్టే కనిపించిన అతను పేలవ ఫుట్‌వర్క్‌తో రబాడ బౌలింగ్‌లో వికెట్లముందు దొరికిపోయాడు. ఇక, సాహా బదులుగా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ పార్థివ్ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 104 పరుగులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ (103), రవిచంద్రన్ అశ్విన్ (22) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.