విండిస్‌తో రెండు టెస్టులు: పృథ్వీషాపై భారీ అంచనాలున్నాయన్న కోహ్లీ


హైదరాబాద్: వెస్టిండిస్‌తో గురువారం నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో యువ ఆటగాడు పృథ్వీషా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తొలి టెస్టు నేపథ్యంలో బుధవారం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ తొలి టెస్టులో ఆడే 12 మంది జట్టు సభ్యులను ప్రకటించాడు.
తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌తో కలిసి పృథ్వీషా ఓపెనింగ్‌కు దిగనున్నాడని కోహ్లీ తెలిపాడు. అంతేకాదు ఇప్పటి వరకు టాపార్డర్‌లో బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేయలేదని ఇకపై యువకులకు కావాల్సినన్ని అవకాశాలు ఇస్తామని కోహ్లీ వెల్లడించాడు. కోహ్లీ మాట్లాడుతూ "టాపార్డర్‌లో మార్పులు చేశాం. ఈ స్థానంలో స్వేచ్ఛగా ఆడేందుకు కుర్రాళ్లకు తగినన్ని అవకాశాలిస్తాం" అని అన్నాడు.
లోయర్ ఆర్డర్‌లో మార్పులకు ఆస్కారం లేదు
"వారు చేస్తున్న పనిపై విశ్వాసం పెంచుకోవాలని కోరుకుంటున్నాం. లోయర్ ఆర్డర్‌లో మార్పులకు ఆస్కారం లేదు. రిషబ్ పంత్‌కు కొత్త అయినప్పటికీ అశ్విన్, జడేజా చాలా మ్యాచుల్లో మంచి ప్రదర్శన చేశారు. విదేశాల్లోనూ అలాగే ఆడితే చాలు. ఈ సిరిస్‌తో టాపార్డర్ కుదురుకుంటే చాలు. ఈ రెండు టెస్టుల్లో ఇబ్బంది పడాల్సిన అంశాలు ఏమీ లేవు" అని చెప్పాడు.
తుది జట్టును మార్పుని సమర్ధించుకున్న కోహ్లీ
ప్రతి మ్యాచ్‌కు తుది జట్టులో పదకొండు మందిని మార్పు చేసే అలవాటును విరాట్ కోహ్లీ సమర్థించుకున్నాడు. అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలన్నదే తమ ఉద్దేశమని కోహ్లీ పేర్కొన్నాడు. పరిస్థితులు, ఫామ్‌ను అనుసరించి జట్టును ఎంపిక చేస్తామని కోహ్లీ తెలిపాడు. అలా చేయడం వల్లనే బౌలర్లు విదేశాల్లో 20 వికెట్లు తీయగలుతున్నారని కోహ్లీ తెలిపాడు.
ఇంగ్లీషు గడ్డపై ఓటమికి కారణం చెప్పిన కోహ్లీ
విదేశీ పర్యటనల్లో స్థాయికి తగిన బ్యాటింగ్ చేయని కారణంగానే ఇంగ్లాండ్‌లో ఓటమి పాలయ్యామని కోహ్లీ పేర్కొన్నాడు. మ్యాచ్ గెలుపులో లోయర్ ఆర్డర్ పరుగులు చాలా కీలకమని కోహ్లీ అన్నాడు. ఐదు టెస్టుల సిరిస్‌లో ఇంగ్లాండ్ అదే చేసిందని ఈ సందర్భంగా కోహ్లీ పేర్కొన్నాడు. విండిస్‌తో సిరీస్‌ను తాము బెంచ్‌మార్క్‌గా తీసుకున్నామని కోహ్లీ అన్నాడు.

ఆసియాకప్ నుంచి విశ్రాంతిపై ఇలా
ఆసియాకప్ నుంచి విశ్రాంతి తీసుకోవడంపై కోహ్లీ ఈ సందర్భంగా స్పందించాడు. "మానసికంగా, శారీరకంగా నేను ఉత్తేజితుడినయ్యా. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీసుల్లో తీవ్రంగా పోటీపడి అలసిపోవడంతో విశ్రాంతి అవసరమైంది. అందరూ పనిభారం గురించి మాట్లాడతారే తప్ప ఆ విధానాన్ని అర్థం చేసుకోరు" అని కోహ్లీ అన్నాడు.

ఆరు గంటలు బ్యాటింగ్ చేస్తే భారంగా ఉన్నట్టు
"ఎక్కువ మ్యాచ్‌లు ఆడటమే పనిభారంగా భావిస్తారు. ప్రతి మ్యాచ్‌లో ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే పనిభారం ఉండదు. అదే నేను ఆరు గంటలు బ్యాటింగ్ చేస్తే భారంగా ఉన్నట్టు. 2019 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇలాంటి విశ్రాంతి ఆటగాళ్లకు అవసరమే. విశ్రాంతి తీసుకోవడం వల్లే ఉత్తేజితులవుతారు" అని విరాట్ కోహ్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications