Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదు: కోహ్లీ

IPL 2019 : Virat Kohli Says IPL Performance Will Have No Effect On WC Team Selection | Oneindia
Kohli says IPL performance will not have an effect on World Cup team selection

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే జట్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని అన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.

కోహ్లీ మాట్లాడుతూ

కోహ్లీ మాట్లాడుతూ

ఈ వన్డేకి ముందు మీడియాతో నిర్వహించిన సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టుపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఒకవేళ తమ దృష్టిలో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో రాణించకపోతే వారు వరల్డ్‌కప్‌కు అనర్హులుగా అనుకోవడం కూడా పొరపాటే" అని అన్నాడు.

కచ్చితమైన జట్టుతో

కచ్చితమైన జట్టుతో

"వరల్డ్‌కప్‌కు కచ్చితమైన జట్టుతో వెళ్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్ని సమంగానే పరిశీలిస్తాం. ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ కోసం బౌలర్‌ను తగ్గించే యోచన లేదు. ఒకవేళ అలా చేస్తే అది కచ్చితంగా మంచి గేమ్‌ ప్లాన్‌ కాదఉ. ప్రధానంగా బ్యాటింగ్‌ కాంబినేషన్స్‌పైనే దృష్టి సారించాం" అని కోహ్లీ పేర్కొన్నాడు.

బౌలింగ్‌ విభాగంలో స్సష్టత

బౌలింగ్‌ విభాగంలో స్సష్టత

ఇప్పటికే భారత బౌలింగ్‌ విభాగంలో స్సష్టత వచ్చిన నేపథ్యంలో ఎటువంటి మార్పులు తాను కోరుకోవడం లేదని కోహ్లీ తెలిపాడు. మరోవైపు వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను ఏ మాత్రం ప్రామాణికంగా తీసుకోబోమని ఇప్పటికే టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు.

ఉప్పల్‌లో ఆసీస్‌పై గెలుపు రుచి చూడని భారత్

ఇదిలా ఉంటే తొలి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌ని గెలవపోవడం విశేషం. ఆస్ట్రేలియా గతంలో ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఒక్కసారీ ఓడిపోలేదు. 2007లో టీమిండియాను ఆస్ట్రేలియా 47 పరుగుల తేడాతో ఓడించింది.

విజయంతో సిరిస్‌ను ప్రారంభించాలని కోహ్లీసేన

మరో రెండేళ్ల తర్వాత జరిగిన మ్యాచ్‌లో షాన్‌మార్ష్‌ సెంచరీ సాధించడంతో ఆసీస్ మూడు పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తొలి వన్డేను కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్పటికే టీ20 సిరిస్‌ను 0-2తో చేజార్చుకున్న టీమిండియా వన్డే సిరిస్‌ను గెలుపుతో ఆరంభించాలని భావిస్తోంది.

Story first published: Friday, March 1, 2019, 17:45 [IST]
Other articles published on Mar 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+