Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను ఇప్పుడు మారిన క్రికెటర్‌ను, నా ప్రాధాన్యం తెలిసింది: విరాట్ కోహ్లీ

Virat Kohli
బెంగళూరు: తాను ఇప్పుడు మారిన క్రికెటర్‌ను అని భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ చెప్పుకున్నాడు. జట్టులో తన ప్రాధాన్యాన్ని గుర్తించానని, దాంతో పరిపక్వత సాధించిన ఆటగాడిగా మారానని అతను అన్నాడు. ఈ నెల 19వ తేదీన జరిగే ప్రపంచ కప్ తొలి మ్యాచులో తాను మంచి ప్రదర్శన ఇవ్వగలననే నమ్మకం ఉందని కోహ్లీ అన్నాడు. తాను ఆట మానసిక ధోరణిపై దృష్టి పెట్టానని, ఇప్పుడు గతంలో కన్నా ఎక్కువ దృష్టి కేంద్రీకరించగలుగుతున్నానని ఈ 22 ఏళ్ల భారత బ్యాట్స్‌మన్ చెప్పాడు.

ఇటీవ తన ఆటతీరులో కొద్దిగా మార్పులు చేసుకున్నట్లు, అనవసమైన తప్పిదాలు జరగకుండా చూసుకుంటున్నట్లు, నియంత్రణతో, దీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడడానికి సిద్ధపడుతున్నట్లు అతను తెలిపాడు. రాష్ షాట్స్ ఆడడం మానేసినట్లు చెప్పాడు. తన సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని అతను అన్నాడు. శిక్షణా శిబిరం ప్రారంభమైనంత వరకు ఒత్తిడి ఫీలయ్యానని, ఇప్పుడు ఆ ఒత్తిడి తొలగిపోయిందని అతను అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+