Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధోనికి కెప్టెన్‌గా కోహ్లీ ఇచ్చే మద్దతు నిజంగా అద్భుతం'

Kohli's support for Dhoni remarkable: Ganguly

హైదరాబాద్: విరాట్ కోహ్లీైప టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల కాలంలో మాజీ క్రికెటర్ల విమర్శలను ఎదుర్కొంటున్న జట్టులోని సహచర ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి కోహ్లీ మద్దతుగా నిలవడంపై అద్భుతమైన విషయమని చెప్పుకొచ్చాడు.

'కోహ్లీ అద్భుతమైన కెప్టెన్. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లి ఏం చేస్తాడో నాకు తెలీదు. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే నేను జట్టుకు చాలా దూరంగా ఉన్నా. జట్టు సమావేశాల్లో కోహ్లీ ఏం మాట్లాడతాడనే విషయం కూడా తెలీదు. కానీ ఆటగాళ్లతో అతడు వ్యవహించే తీరు నిజంగా అద్భుతం' అని గంగూలీ పేర్కొన్నాడు.

ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో కోహ్లీ వ్యవహరించిన తీరు అద్భుతమని దాదా చెప్పుకొచ్చాడు. 'కెరీర్ చరమాంకలో ఉన్న చాంపియన్ ఆటగాడు ధోని. అలాంటి ఆటగాడు జట్టులో ఉండాలని, అతడి కోహ్లీ మద్దతుగా నిలిచాడు. ఇది ధోనిపై ఎంతో ప్రభావం చూపడమే కాకుండా అతను తిరిగి పూర్తిస్థాయిలో ఆడటానికి ఉపయోగపడుతుంది' అని గంగూలీ అన్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరిస్‌లో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో మహేంద్ర సింగ్ ధోని పేలవ ప్రదర్శన చేసిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్‌లు టీ20ల నుంచి ధోని తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని విమర్శించిన సంగతి తెలిసిందే.

దీనిపై గంగూలీ మాట్లాడుతూ 'ధోని టాప్ క్లాస్ క్రికెటర్. సుదీర్ఘకాలం భారత క్రికెట్‌కు ఆడిన అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. ధోని తన భవిష్యత్తుని సరిగ్గా హ్యాండిల్ చేయగలడు' అని గంగూలీ తెలిపాడు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు.

'కోహ్లీ అంటే ఇష్టం. అతడు ఆడటాన్ని ఆస్వాదిస్తా. సోఫాపై కూర్చుని మైదానంలో అతడు పీల్డింగ్ చేయడాన్ని చూశా. గతంలో ఎన్నోసార్లు చెప్పాను, కోహ్లీ ఓ ఛాంపియన్ ప్లేయర్. కెప్టెన్‌గా అతడు అన్ని పరిస్థితుల్లో విజయాలను నమోదు చేయాలని కోరుకుంటాడు. క్రికెట్ పట్ల అతడికి ఎంతో నిబద్ధత ఉంది' అని దాదా అన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 17:29 [IST]
Other articles published on Nov 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+