For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ నవ్వుపై జోకులు: గూగుల్ పేలో రూ.20 పంపిస్తే రూ.50 క్యాష్ బ్యాక్ వచ్చినట్లు!

Kohlis Reaction to Vijay Shankar Picking Wicket on His First World Cup Ball is Truly Priceless

హైదరాబాద్: తన తొలి ప్రపంచకప్‌ను టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఎంతో ఘనంగా ఆరంభించాడు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్‌ శంకర్‌ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో వేసిన తొలి బంతికే వికెట్‌ దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో పాక్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఐదో ఓవర్‌లో నాలుగు బంతులు వేసిన అనంతరం గాయంతో భువనేశ్వర్ కుమార్ మైదానాన్ని వీడాడు. దీంతో చివరి రెండు బంతులు వేయాల్సిందిగా బంతిని ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ బంతిని అందుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్‌ దక్కడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

అసలే ప్రపంచకప్.. అందులోనూ దాయాదితో పోరు. ఇంతటి అద్భుతమైన మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే పాక్ ఓపెనర్ ఇమామ్‌ ఉల్‌ హక్‌‌(7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బోల్తా కొట్టించాడు. ఊహించని రీతిలో వికెట్ లభించడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.

వికెట్ పడిన వెంటనే విజయ్ శంకర్ వద్దకు వెళ్లి ఆనందంతో ఒక్కసారి ఉబ్బితబ్బిబయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ నవ్వుపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. కాగా, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో విజయ్‌ శంకర్‌కు చోటు దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌‌లో ఆఖర్లో బ్యాటింగ్‌కు విజయ్ శంకర్ పెద్దగా ఆకట్టుకోక పోయనప్పటికీ.... తొలి బంతికే వికెట్‌ దక్కించుకోవడంపై విజయ్‌ శంకర్‌పై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. కాగా. ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విజయంతో ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఏకంగా ఏడోసారి ఓడించి ప్రపంచకప్‌లో పాక్‌పై తన విజయ పరంపరను భారత్‌ కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది.

Story first published: Monday, June 17, 2019, 17:37 [IST]
Other articles published on Jun 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+