Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇరు జట్ల మధ్య కోహ్లీనే తేడా: కమిన్స్

Kohli The Difference Between The Teams in Second ODI Says Cummins | Oneindia Telugu
Kohli’s innings made the difference, says Cummins

హైదరాబాద్: ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ పాట్ కమిన్స్ అన్నాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రెండో వన్డేలో టీమిండియా విరాట్ కోహ్లి (116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి తోడు విజయ్‌ శంకర్‌(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది.

సెంచరీతో చెలరేగిన కోహ్లీ

సెంచరీతో చెలరేగిన కోహ్లీ

రెండో వన్డేలో టీమిండియా కోహ్లీ చేసిన 116 పరుగులే రెండు జట్ల మధ్య ప్రధాన తేడా కమిన్స్‌ చెప్పుకొచ్చాడు. కోహ్లీ చాలా బంతులు ఎదుర్కొన్నాడని, అద్భుతమైన షాట్లు ఆడాడని కొనియాడాడు. మిడిలార్డర్‌ విఫలమైనప్పటికీ... ఒక్కడే నిలకడగా ఆడుతూ కోహ్లీ 40వ సెంచరీ నమోదు చేసిన టీమిండియాకు గౌరవ ప్రదమైన స్కోరు చేసిన సంగతి తెలిసిందే.

కమిన్స్ మాట్లాడుతూ

కమిన్స్ మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో కమిన్స్ మాట్లాడుతూ "ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా కోహ్లీనే. మేం మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. మార్కస్‌ స్టాయినిస్‌ హాఫ్ సెంచరీ చేశాడు. శుభారంభమే లభించింది. గెలిపించే ఆటగాడు మాత్రం మాకు దొరకలేదు. టీమిండియాకు మాత్రం విరాట్‌ కోహ్లీ ఉన్నాడు" అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

రెండు జట్లకు అతడే తేడా

రెండు జట్లకు అతడే తేడా

"కోహ్లీ చాలా బంతులు ఎదుర్కొన్నాడు. రెండు జట్లకు అతడే తేడా. అవకాశం లేని చోట 250 స్కోరు సాధించాడు. అతడికి మేం అద్భుతమైన బంతులు వేశాం. అతడు స్పిన్‌ను ఎదుర్కొన్న తీరు ఈ వికెట్‌పై మాకైతే కష్టమే. ప్రస్తుతం ఆటపై పూర్తి పట్టున్న వ్యక్తి అతడే" అని కోహ్లీపై కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.

శుక్రవారం రాంచీలో మూడో వన్డే

శుక్రవారం రాంచీలో మూడో వన్డే

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో మూడో వన్డే శుక్రవారం రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు రాంచీకి చేరుకున్నాయి.

Story first published: Thursday, March 7, 2019, 10:59 [IST]
Other articles published on Mar 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+