For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టెస్టుకు టీమిండియా ముందు 5 ప్రశ్నలు

India vs England : Indian Team Faces 5 Questions For Its Next Match
Kohlis Fitness, Pants Inclusion - Five Questions India Face Ahead of Third Test

నాటింగ్‌హామ్: ఛాలెంజింగ్ గేమ్‌ను కోరుకునే కెప్టెన్ కోహ్లీ ముంగిట పెను సవాల్ నిల్చొంది. ఇంగ్లీషు బౌలర్ల ధాటికి రెండు టెస్టుల్లోనూ తడబడ్డ టీమిండియా బ్యాట్స్‌మెన్‌లతో మూడో టెస్టులో ఎలా రాణిస్తాడనేది సందిగ్ధంగా మారింది. నాటింగ్ హామ్ వేదికగా మొదలుకానున్న మూడో టెస్టునుంచి టీమిండియా కచ్చితంగా గెలిస్తేనే సిరీస్‌లో నిలవగలదు. ఈ క్రమంలో పూర్తిగా విఫలమైన బ్యాట్స్‌మెన్.. పరుగులు సమర్పించుకుంటున్న కుల్దీప్ లాంటి యువ బౌలర్ల స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది టీమిండియాకు ఎడతెగని ప్రశ్న.

ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో ఓటమి కోహ్లీసేనపై పెను ప్రభావమే చూపించింది. మాజీ క్రికెటర్లు బాహాటంగానే ఆటగాళ్లపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. చివరికి విదేశీ మాజీ ఆటగాళ్లు సైతం విరాట్‌ సేనపై జాలి కురిపిస్తూ వెక్కిరిస్తున్నారు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 0-2తో వెనకబడిన కోహ్లీసేనకు ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగే మూడో టెస్టు ముందు 5 ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

జట్టు ప్రధాన లోపం.. కోహ్లీ ఫిట్‌నెస్:

జట్టు ప్రధాన లోపం.. కోహ్లీ ఫిట్‌నెస్:

రెండో టెస్టు ఆడుతుండగా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో నిలబడేందుకు, షాట్లు ఆడేందుకు, పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ మూడో టెస్టుకు ఆడేందుకు మిగిలి ఉన్న 5 రోజుల సమయంలో కోలుకుని తీరతానని హామీ ఇచ్చాడు. అప్పటికల్లా నొప్పి తగ్గి ఫిట్‌నెస్‌ సంతరించుకుంటానని పేర్కొన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో విరాట్‌ మూడో టెస్టు ఆడటం ఎంతో కీలకం. కాసేపైనా క్రీజులో కుదురుకుంటే మిగతా ఆటగాళ్లు అతడి నుంచి ప్రేరణ పొందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ జట్టులో ఆడకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి?

 ఓపెనర్లుగా ఎవరెవరొస్తారో:

ఓపెనర్లుగా ఎవరెవరొస్తారో:

ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లోనూ భారత ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు. శిఖర్‌ ధావన్‌ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 39 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్సుల్లో కలిపి కేఎల్‌ రాహుల్‌ 35, మురళీ విజయ్‌ 26 పరుగులు మాత్రమే చేశారు. లార్డ్స్‌ టెస్టులోనైతే విజయ్‌ రెండు సార్లూ అండర్సన్‌ బౌలింగ్‌లో డకౌట్‌ కావడం గమనార్హం. కేఎల్‌ రాహుల్‌కు అపార ప్రతిభ ఉన్నా అందుకు తగ్గట్టు రాణించలేదు. అంతకుముందు అతడికి వచ్చిన అవకాశాలూ తక్కువే. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో టీమిండియా ఎవరెవరిని ఓపెనర్లుగా పంపుతారో..?

ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్:

ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్:

మూడో టెస్టులో కోహ్లీ ఐదుగురు బౌలర్లను ఆడించాలనుకుంటే కచ్చితంగా ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ను రంగంలోకి దించాల్సిందే. అలాంటప్పుడు పాండ్యను పక్కన పెట్టి ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్‌ నాయర్‌ను తీసుకోవాల్సిందే. ఇప్పటి వరకు కోహ్లీని మినహాయిస్తే అశ్విన్‌ మాత్రమే రెండు మ్యాచుల్లోనూ బ్యాట్‌తో కాస్త రాణించగలిగాడు. రహానె, పుజారా, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ ఆశించిన మేర వరకు రాణించలేకపోయారు. ట్రెంట్‌బ్రిడ్జ్‌ పిచ్‌ స్వింగ్‌, పేస్‌కు అనుకూలిస్తే మాత్రం బంతితో సత్తా చాటుతున్న పాండ్యను కోహ్లీ తప్పించేందుకు ఇష్టపడతాడా?

 కార్తీక్ స్థానంలోకి పంత్ వస్తాడా:

కార్తీక్ స్థానంలోకి పంత్ వస్తాడా:

టీమిండియాలోకి పునరాగమనం చేసిన నాటినుంచి వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ చక్కగా ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో క్లిష్ట సమయాల్లో రాణించి జట్టుకు అండగా నిలిచాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అనుభవం ఉన్న అతడు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. అయితే అతడు 4 ఇన్నింగ్సుల్లో చేసింది 0, 1, 20, 0 మాత్రమే. ఈ నేపథ్యంలో అందరి చూపూ ధోనీ వారసుడిగా భావిస్తున్న రిషబ్‌ పంత్‌పై పడింది. ఈ సిరీస్‌కు అతడిని బ్యాకప్‌ కీపర్‌గా ఎంపిక చేశారు. 2016-17 రంజీ సీజన్‌లో, ఐపీఎల్‌-18లో, భారత్‌-ఏ తరఫున అద్భుతంగా రాణించిన యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌పంత్‌తో‌ టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడా?

జడేజాను తీసుకుంటే కుల్దీప్ పరిస్థితి:

జడేజాను తీసుకుంటే కుల్దీప్ పరిస్థితి:

లార్డ్స్‌ టెస్టులో కుల్‌దీప్‌ను ఆడించడం పొరపాటేనని కోహ్లీ అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 44 పరుగులు ఇచ్చాడు. ట్రెంట్‌బ్రిడ్జ్‌ పిచ్‌ టర్న్‌కు సహకరించకపోతే మాత్రం కుల్‌దీప్‌ బదులు వేరే పేసర్‌కు చోటు ఇవ్వాల్సిందే. అలాకాని పక్షంలో తన అనుభవంతో బ్యాటింగ్‌లోనూ రాణించగల పరుగులు చేయగల రవీంద్ర జడేజాను తీసుకోవాలా?

Story first published: Thursday, August 16, 2018, 14:51 [IST]
Other articles published on Aug 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+