న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి ధీటుగా పోస్టు పెట్టి శుభాకాంక్షలు తెలిపిన అనుష్క

Kohli’s anniversary gesture, Warne backs Stoinis swagger, Langer expects old school Perth

న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం ఎన్నో సస్పెన్స్‌లకు తెరదీస్తూ తమ వివాహం జరిగిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా విరాట్ అనుష్కలు వెల్లడించారు. మీడియా కంటికి దూరంగా ఇటలీలో వివాహ వేడుకను ముగించుకున్నారు ఈ జంట. మరోసారి తమ వివాహ వార్షికోత్సవ వేడుకను విదేశాల్లో జరుపుకుని ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. అప్పుడే ఏడాది గడిచిపోయిందంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొనగా దానికి ఓ వీడియోను జోడించిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ భర్తకు శుభాకాంక్షలు తెలియజేశారు.

భార్య అనుష్కకు ట్విట్టర్ ద్వారా కోహ్లీ

భార్య అనుష్కకు ట్విట్టర్ ద్వారా కోహ్లీ

ఆసీస్‌తో సిరీస్ నిమిత్తం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఈ వివాహ వార్షికోత్సవ వేడుకల కోసం అనుష్క కూడా ఆస్ట్రేలియా వెళ్లారు. ఇదిలా ఉంటే, తొలి వివాహ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని తన భార్య అనుష్కకు ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు.

నువ్వెప్పటికీ నా దానివే

‘అప్పుడే ఏడాది గడిచిపోయిందంటే అస్సలు నమ్మలేకపోతున్నా. మా వివాహం నిన్నే జరిగినట్టు అనిపిస్తోంది. కాలం చాలా వేగంగా గడిచిపోతోంది. నా ప్రాణ స్నేహితురాలు, నా అర్ధాంగికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నువ్వెప్పటికీ నా దానివే' అంటూ కోహ్లీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, అనుష్క కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇటలీలో జరిగిన తమ పెళ్లి వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

మంచి మనిషిని పెళ్లాడితే అదో స్వర్గం

‘కాలం గడిచిపోవడాన్ని మీరు గమనించకపోతే అదో స్వర్గం. ఓ మంచి మనిషిని మీరు పెళ్లాడితే అదో స్వర్గం' అని అనుష్క పేర్కొన్నారు. అనుష్క షేర్ చేసిన ఈ వీడియో చాలా రిచ్‌గా ఉంది. మొత్తం పెళ్లి తతంగాన్ని ఒక చిన్న వీడియోలో చూపించారు. అనుష్క పోస్ట్ చేసిన అరగంటలోనే ఈ వీడియోను 70 లక్షలకు పైగా చూశారు.

1
43624
Story first published: Tuesday, December 11, 2018, 13:32 [IST]
Other articles published on Dec 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X