
కోహ్లీలో ఎలాంటి మార్పూ లేదు
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రచించిన పుస్తకం 'డెమోక్రసీస్ ఎలెవన్ - ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ' ఆవిష్కరణ సందర్భంగా జరిగిన చర్చలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'భారత్ తరుపున అరంగేట్ర సమయానికి, ఇప్పటికీ కోహ్లీలో ఎలాంటి మార్పూ లేదు' అని సచిన్ అన్నాడు.

కోహ్లీలో ఆ దూకుడు నేను అప్పుడే గుర్తించాను
'కోహ్లీలో ఆ దూకుడు నేను అప్పుడే గుర్తించాను. అతడిలో ఆ స్వభావాన్ని అప్పట్లో చాలా మంది ఇష్టపడలేదు. అలా ఉన్నందుకు చాలా మంది అతణ్ని విమర్శించారు కూడా. అతడిలోని ఆ దూకుడే భారత జట్టు బలమైంది. కోహ్లీ పెద్దగా మారలేదు. కానీ అతడి చుట్టూ ఉన్నవాళ్లే మారారు' అని సచిన్ చెప్పుకొచ్చాడు.

హాజరైన ప్రముఖ క్రికెటర్లు
ఇదిలా ఉంటే ముంబైలోని రాయల్ ఓపెరా హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి టీమిండియా మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, అజిత్ వాడేకర్, నారీ కాంట్రాక్టర్, వినోద్ కాంబ్లీ, ప్రవీణ్ ఆమ్రే, అజహరుద్దీన్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీతో తనకున్న అనుబంధాన్ని గవాస్కర్ గుర్తు చేసుకున్నారు.

మూడు వన్డేల సిరిస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యం
కాగా, ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరిస్ ఆడుతోంది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆదివారం ముంబై వాంఖడె స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications