
ఇరుజట్లకు సమాన అవకాశాలు
ఈ టోర్నీలో భారత్-పాక్ జట్లకు టైటిల్ గెలిచేందుకు సమాన అవకాశాలున్నాయని చెప్పాడు. విరాట్ విశ్రాంతి తీసుకోవడంతో టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో దాయాది దేశంపై టీమిండియాకు ఘనమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. కానీ ఈ సారి ఆసియాకప్‌లో ఇరుజట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కోహ్లికి విశ్రాంతినిచ్చినప్పటికీ రోహిత్ సేన బలంగానే
భవిష్యత్ సిరీస్‌ల దృష్ట్యా సెలక్టర్లు విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చినప్పటికీ రోహిత్ సేన బలంగానే ఉందన్నారు. పాకిస్తాన్ జట్టు అన్ని రంగాల్లో ఇంకాస్త మెరుగుపడాలని సూచించారు. ‘విరాట్ ఉన్నాడా లేడా అన్నది ముఖ్యం కాదు. అతడు లేకపోయినా భారత్ గట్టి జట్టే' అని సౌరవ్ పేర్కొన్నాడు. చాంపియన్ ట్రోఫిలో పాక్‌పై టీమిండియా ఓడిపోయిందని, కానీ ఆ ప్రభావం ప్రస్తుత టోర్నీలో రోహిత్ సేనపై ఉండదని స్పష్టం చేశారు.

టీమిండియా 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లే
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు అన్ని రంగాల్లో బలంగానే ఉందన్నారు. టీమిండియా ఆసియా కప్‌ను అత్యధికంగా ఆరు సార్లు గెలువగా, పాకిస్తాన్ కేవలం రెండు సార్లే గెలిచిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆసియాకప్‌లో రోహిత్ సేన తొలి మ్యాచ్ మంగళవారం హాంగ్‌కాంగ్‌తో తలపడిన మరుసటి రోజే(బుధవారం) దాయాది దేశమైన పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పసికూన హాంగ్‌కాంగ్‌పై పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్ గెలిచే అవకాశాలున్నాయని సంజయ్
ఆసియా కప్‌లో భారత్ ప్రధాన పోటీదారుగా ఉన్నా..టైటిల్ మాత్రం పాకిస్థాన్ గెలిచే అవకాశాలున్నాయని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. యూఏఈలో పాక్ తరచూ ఆడుతుండడం ఆ జట్టుకు అనుకూలించనుందని చెప్పాడు. ‘అనూహ్యంగా పుంజుకునే జట్లలో పాక్ ఒకటి. కానీ విరాట్ లేకపోవడంతో భారత్ బలహీన పడింది' అని వివరించాడు.


Click it and Unblock the Notifications

